కోలీవుడ్‌లో పిన్న వయసులోనే మంచి పేరు సంపాయించుకున్నయువ హీరో దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచనాలు మించి విజయం దక్కించుకున్నా యి. సాధారణంగా ఏ హీరోకైనా.. బాక్సాఫీస్ వద్ద చిత్రం హిట్ అనే టాక్ కోసం ఎదురు చూస్తారు. విమర్శ లు, రివ్యూలపై చాలా మంది ఆధారపడతారు. చిత్రం విడుదలకు ముందు.. రివ్యూలు, విమర్శకుల నుంచి మంచి మార్కులు పడితే..ఇక, తిరుగు ఉండదని భావిస్తారు.
తమిళనాడులోని అగ్ర నటులు రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, సూర్య, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్ వంటివారు కూడా.. బాక్సాఫీసుపై ఆధారపడి ఉంటారు. వీరి సినిమాలకు మంచి రివ్యూలు, విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఆయా సినిమాలు బాక్సాఫీసు దగ్గర భారీ సక్సెస్ రేటును డబ్బును కూడా కూడగట్టుకున్నాయి. అయితే.. దళపతివిజయ్ విషయంలో మాత్రం విమర్శలు, రివ్యూలు ఎలా ఉన్నా.. సినిమాలు విడుదలయ్యాక మాత్రం సూపర్ డూపర్ హిట్ కొట్టాయి.
అంటే.. క్రిటిక్స్, రివ్యూస్ తో సంబంధం లేకుండా మరీ ముఖ్యంగా మౌత్ టాక్‌కి కూడా సంబంధం లేకుండా.. విజయ్ తన సినిమాలను విజయవంతం చేసుకున్నాడు. ఫ్యామిలీ కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కోలీవుడ్‌లోనే కాకుండా.. ఓవర్సీస్‌లో దాదాపు ఇరవై దేశాలలో మంచి మార్కెట్ ఉన్న ఏకైక హీరోగా దళపతి విజయం పేరు తెచ్చుకున్నారు. అయితే.. ఇప్పుడు ఆయన పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా అవతరించారు.
సొంతగా పార్టీ పెట్టుకున్నారు. ఇటీవల ఆయన నటించిన చివరి 4 సినిమాలు బీస్ట్, వరిసు, లియో, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(గోట్). ఈ నాలుగింటిలో ఒక్క సినిమా కూడా ఏకగ్రీవంగా ఎవరి నుంచి సానుకూల రివ్యూకు నోచు కోలేదు. కానీ, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు మాత్రం కనక వర్షం కురిపించాయి. అంటే.. మౌత్ పబ్లిసిటీ ఎలా ఉన్నా.. సినిమాలు మాత్రం సూపర్ హిట్ కొట్టాయి. దీనిని బట్టి.. ఇప్పుడు సొంత పార్టీ తమిళగ వెట్రి కళగం
కూడా హిట్ అవుతుందన్న చర్చ సాగుతోంది.
ఇప్పటి వరకు అయితే.. ఈ పార్టీపై పెద్దగా అంచనాలు లేవు. విజయ్ సినిమాల మాదిరిగానే ఈ పార్టీపై కూడా పెద్దగా సానుకూల వాతావరణం.. కామెంట్లు రావడం లేదు. అయితే.. ఎలాంటి విమర్శలు వచ్చినా.. రివ్యూలు వచ్చినా విజయ్ సినిమాలు హిట్ అయినట్టే ఆయన పార్టీ కూడా హిట్ కొడుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో భారీ విజయాన్ని సాధించాలనే లక్ష్యంతో రాజకీయాలపై విజయ్ పూర్తి దృష్టి పెట్టారు. దీంతో సినిమాలను పక్కన పెట్టారు. ఇదినిర్మాతలను కొంత నిరాశకు గురి చేసినా.. రాజకీయంగా ఆయన సైలెంట్ వేవ్‌సృష్టించడం ఖాయమని పరిశీలకులు చెబుతున్నారు.
This post was last modified on November 18, 2024 1:24 pm
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…
సామాజిక భద్రతా పింఛన్.. ఇది చాలా సునిశితమైన అంశం. ఆర్థికంగా ముడిపడిన వ్యవహారమే అయినా .. అత్యంత సెన్సిటివ్ అంశం.…