జనం డబ్బుతో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్, షర్మిల, విజయమ్మ, సునీతలను జగన్ బూతులు తిట్టించారా? అంటే అవును అని ఏపీ హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత ఆరోపిస్తున్నారు.
జగన్ హయాంలో ఏపీ డిజిటల్ కార్పోరేషన్ చైర్మన్ గా వాసుదేవరెడ్డిని నియమించిందని, నెలకు మూడున్నర లక్షల రూపాయల జీతం కూడా ఇచ్చిందని అనిత చెప్పారు. ఆ కార్పొరేషన్ కు ప్రభుత్వం ఇచ్చిన నిధులతో సోషల్ మీడియా వ్యవస్థల్ని నడిపించి టీడీపీ, జనసేన నేతలను తిట్టించారని అనిత ఆరోపించారు.
టీడీపీ, జనసేన నేతలను బూతులు తిట్టి మార్ఫింగ్ వీడియోలు పెట్టడానికి ప్రజాధనం వాడారని, అది జగన్ జేబులో సొమ్ము కాదు..ప్రజల సొమ్ము అని అన్నారు. ఇలా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారని, వీళ్లు నేరస్థుల ముసుగులో ఉన్న రాజకీయ నాయకులు కాదా అని ప్రశ్నించారు.
స్టేట్ మొత్తానికి కలిపి 130 మంది మెయిన్ కేడర్ ఈ సోషల్ మీడియా కోసం పని చేశారని, 400 గ్రూపులు, 40 యూట్యూబ్ ఛానెళ్లు ఈ విష ప్రచారం కోసం పనిచేశాయని ఆరోపించారు.
సజ్జల భార్గవ్ చార్జ్ తీసుకున్న తర్వాత వైసీపీ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెరిగాయని వర్రా రవీందర్ రెడ్డి చెప్పారని అనిత అన్నారు. ప్రస్తుతం అరెస్టయిన అర్జున్ రెడ్డి అనే వ్యక్తి ఎంపీ అవినాష్ రెడ్డికి సన్నిహితుడని చెప్పారు.
ఇలాంటి ఇడియట్స్ గురించి ఎన్ హెచ్ ఆర్సీకి వెళ్లామా అని పెద్దల సభకు వెళ్లిన పెద్ద మనుషులకు తెలియాలని అన్నారు. నీ తల్లిని, చెల్లిని లేపేయమని, బూతులు తిట్టిన వ్యక్తిని అరెస్టు చేస్తే ..వారిది అక్రమ అరెస్టు అని ఖండించడానికి నోరు ఎలా వచ్చింది జగన్ అని అనిత ప్రశ్నించారు. వైసీపీ సోషల్ మీడియా క్రైం కథా చిత్రం ఇది అంటూ వైసీపీ నేతలపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.