ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున 11 మంది ఎమ్మెల్యేలు విజయం దక్కించుకున్నారు. వీరిలో జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి కరడు గట్టిన టీడీపీ వ్యతిరేకులను పక్కన పెడితే.. 7 నుంచి 8 మంది వరకు సౌమ్యులు.. తొలి సారి విజయం దక్కించుకున్న నలుగురు కూడా ఉన్నారు. వీరికి సభకు వెళ్లాలని ఆశగా ఉంది. అధ్యక్షా అని పిలవాలని కూడా ఉంది. సభలో చర్చలకు పట్టుబట్టాలని కూడా ఉంది. కానీ, అధినేత ససేమిరా అంటున్నారు.
ఇప్పటి వరకు మూడు సార్లు అసెంబ్లీ భేటీ అయింది. తొలిసారి సభకు అందరూ వెళ్లారు. ప్రమాణం చేసి వచ్చారు. మలిసారి జూలైలో జరిగిన సమావేశాలకు కూడా వెళ్లారు. గవర్నర్ ప్రసంగం రోజు ఆందోళన చేసి బయటకు వచ్చేశారు. కట్ చేస్తే.. ఇప్పుడు మూడోసారి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే.. ఈ సభలకైనా వెళ్లాలని కొందరు ఎమ్మెల్యేలు భావించారు. కానీ, జగన్ వద్దన్నారు. కట్ చేస్తే.. ఇక, మళ్లీ వచ్చే ఏడాదే సభలు జరుగుతాయి.
ఈ లోగా జగన్ కొంత రియలైజ్ అయి.. అన్ని వర్గాల నుంచి వస్తున్న సమాచారాన్ని(సభకు వెళ్లాలన్న సూచనలు, సలహాలు) బట్టి.. ఆయన మనసు మార్చుకునే అవకాశం ఉందని వైసీపీ నాయకులు అనుకున్నారు. కాబట్టి వచ్చే సభలకైనా ఏదో ఒకరకంగా సభలో అడుగు పెట్టాలని భావించారు. కానీ, తాజాగా జరిగిన పరిణామం.. వారి చిన్ని ఆశను పూర్తిగా చంపేసింది. దీనికి కారణం.. జగన్.. తనకు బద్ధ శత్రువుగా భావించే.. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అవుతున్నారు.
ఈ పరిణామంతో పూర్తిగా వైసీపీ ఎమ్మెల్యేలు నీరుగారిపోయారు. ఎందుకంటే తాము వెళ్లాలంటే జగన్ అనుమతి ఉండాలి. రఘురామ డిప్యూటీగా ఉన్నంత వరకు.. జగన్ అనుమతి ఇవ్వరు. అంటే.. ఇక, తమకు సభా యోగం లేనట్టే అని వారు నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం రఘురామను డిప్యూటీ స్పీకర్‌ను చేస్తూ.. చంద్రబాబు నిర్ణయించారు. ఆయన ఎన్నిక కూడా లాంఛనమే. సో.. ఈ పరిణామంతో ఇక, జగన్ రావాలని ఉన్నారావడం సాధ్యం కాదన్నది వైసీపీ నాయకులు కూడా చెబుతున్నారు. ఇక, ఈ సారికి ఇంతే..!
Gulte Telugu Telugu Political and Movie News Updates