పులివెందుల ఎమ్మెల్యే, మాజీ సీఎం జగన్ పై ఏపీ హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే జగన్ ఇంకా రోడ్లపై తిరుగగలుగుతున్నారని అనిత చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సోషల్ మీడియాలో నీచమైన పోస్టులు పెట్టే వారిని అరెస్టు చేస్తే మానవ హక్కులు హరిస్తున్నారని జగన్ గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు.
అటువంటి వారిని పోలీస్ స్టేషన్ కు కాకుండా ఎక్కడికి తీసుకువెళతారని ప్రశ్నించారు. అమాయకులపై వైసీపీ నేతలు గతంలో కేసులు పెట్టి హింసిచారని, కానీ, ఈ రోజు అరెస్టులపై ఎన్‌హెచ్ఆర్సీకి వెళ్లి గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. సొంత తల్లి, చెల్లిని తిట్టిన నేరస్తులకు, జడ్జిలపై అభ్యంతరక పోస్టులు పెట్టిన వారికి జగన్ సపోర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఆడబిడ్డలను దూషిస్తే రాయలసీమ ప్రజలు ఊరుకోరని, అందుకే మహిళలపై తప్పుడు పోస్టులు పెట్టేవారిని చంద్రబాబు ఉపేక్షించబోరని అన్నారు. పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
గతంలో మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసిన జగన్ కు అంబేద్కర్ రాజ్యాంగం కనిపించడని కౌంటర్ ఇచ్చారు. డిజిటల్ కార్పోరేషన్ ఎండా వాసుదేవరెడ్డి గత ప్రభుత్వ నిధులతో సోషల్ మీడియా వ్యవస్థల్ని నడిపించారని అనిత ఆరోపించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates