Political News

విజ‌య‌వాడ కార్పొరేష‌న్‌లో వైసీపీ జెండా పీకేశారు..!

విజ‌య‌వాడ కార్పొరేష‌న్‌లో వైసీపీ జెండా దించేశారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కార్పొరేష‌న్ వెలుప‌ల ప్ర‌హ‌రీ ని ఆనుకుని ఉన్న జెండా దిమ్మెపై వైసీపీ ఎన్నిక‌ల జెండాను ఎగుర‌వేశారు. అయితే.. సోమ‌వారం మాత్రం జెండాను తీసేశారు. దీంతో ఏం జ‌రిగింద‌న్న చ‌ర్చ ఆస‌క్తిగా మారింది. విజ‌య‌వాడ కార్పొరేష‌న్‌ను గ‌త 2021లో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో వైసీపీ ద‌క్కించుకుంది. జ‌న‌ర‌ల్‌కు కేటాయించి మేయ‌ర్ ప‌ద‌విని కూడా బీసీ సామాజిక వ‌ర్గానికి కేటాయించి మ‌రీ ప్రాధాన్యం ఇచ్చారు.

దీంతో కొన్నాళ్లు బాగానే సాగింది. అయితే. కూట‌మి స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. మెజారిటీ వైసీపీ కార్పొరేట‌ర్లు.. వైసీపీకి దూర‌మ‌య్యారు. తాజాగా 32 మంది కార్పొరేట‌ర్లు జెండా మార్చేశారు. కొంద‌రు టీడీపీలో చేర‌గా.. 19 మంది జ‌నసేన బాట ప‌ట్టారు. దీంతో సంఖ్యా ప‌రంగా వైసీపీకి సీట్లు త‌గ్గాయి. మ‌రోవైపు మేయ‌ర్ కూడా.. జ‌నసేన వైపు చూస్తున్నార‌న్న చ‌ర్చ సాగుతోంది. ఈ ప‌రిణామాలతోనే కౌన్సిల్ స‌మావేశాలు కూడా జ‌ర‌గ‌డం లేదు.

ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం ఉన్న కార్పొరేట‌ర్ల‌ను కూడా.. టీడీపీలో చేర్పించేలా కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ముఖ్యంగా సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే త‌న ప‌రిధిలోని కార్పొరేట‌ర్ల‌ను టీడీపీలోకి తీసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇది స‌క్సెస్ అయితే.. పూర్తిగా వైసీపీ కార్పొరేట‌ర్లు పార్టీ మార‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. మ‌రోవైపు.. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి కూడా.. కొంద‌రిని బీజేపీలోకి చేర్పించ‌డం ద్వారా.. త‌న హ‌వా పెంచుకునే ఉద్దేశంలో ఉన్నారు.

అయితే.. బీజేపీలోకి కార్పొరేట‌ర్లు వెళ్ల‌కుండా టీడీపీ నాయ‌కులు అడ్డు ప‌డుతున్నారు. ఇదే జ‌రిగితే.. అది సుజ‌నాకు మ‌రింత ద‌న్నుగా మారుతుంద‌నివారు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో టీడీపీలో చేరేవారికి డిమాండ్ పెరుగుతోంది. వార్డు ప‌రిధిలో నిధులు, వ్య‌క్తిగ‌త స‌మ‌స్యల ప‌రిష్కారం కోసం.. కార్పొరేట‌ర్లు ప్ర‌య‌త్నిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. వైసీపీ పోవ‌డం అయితే ఖాయం అయిపోయింది.అ యితే.. ఇంత జ‌రుగుతున్నా స్థానిక మాజీ మంత్రి వైసీపీ నాయ‌కుడు వెల్లంప‌ల్లి శ్రీనివాస్ మాత్రం సైలెంట్ అయిపోయారు.

This post was last modified on November 12, 2024 11:14 pm

Share

Recent Posts

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

13 minutes ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

41 minutes ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

50 minutes ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

3 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

4 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

5 hours ago