విజన్ 2047 లక్ష్యంగా వికసిత ఆంధ్రప్రదేశ్ సాకారం కోసం ఏపీ సీఎం చంద్రబాబు ముందుకు వెళుతోన్న సంగతి తెలిసిందే. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దడంతో పాటు గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడంలో చంద్రబాబు బిజీగా ఉన్నారు. ఏపీకి టాటా వంటి దిగ్గజ సంస్థలను తీసుకురావడంతో పాటు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే విజన్ 2047 సూచనలు, సలహాలు ఇవ్వాలని ఎన్డీఏ కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చంద్రబాబు కోరారు.
ఎన్డీఏ కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన నిర్వహించిన వర్క్ షాప్ సందర్భంగా చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాలపై, నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అవగాహన పెంచుకోవాలని చంద్రబాబు సూచించారు. అంతేకాదు, ప్రభుత్వం తెస్తున్న బిల్లులు, పాలసీలపై అధ్యయనం చేయాలని అన్నారు. ఎమ్మెల్యేలు నిరంతరం సబ్జెక్ట్ నేర్చుకోవాలని, తెలుసుకోవాలని చెప్పారు. సభలో ప్రతిపక్షం లేదని, అయినా సరే ప్రజలకు జవాబుదారీగా ఉండాలని తెలిపారు.
ఇక, శాసన సభ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. దీంతోపాటు, తాజా రాజకీయా పరిణామాలపై కూడా కూటమి నేతలతో చంద్రబాబు చర్చలు జరిపారు. బీఏసీ మీటింగ్ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్, విప్ ల ప్రస్తావన రావడంపై కూడా చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి ఎవరిని ప్రభుత్వ చీఫ్ విప్ గా నియమిస్తారు? ఎంతమంది విప్ లు ఉంటారు అన్నదానిపై కూడా చర్చ జరిగిందని తెలుస్తోంది.
This post was last modified on November 12, 2024 6:48 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…