వైసీపీ పాలనలో రంగుల పిచ్చిపై కోర్టులు సైతం జగన్ సర్కార్ కు పలుమార్లు మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. అయినా సరే తీరు మారని గత ప్రభుత్వం…చిన్న పిల్లలు తినే ఫల్లీ చిక్కీలు మొదలు పాఠ్యపుస్తకాల వరకు అవకాశమున్న అన్ని చోట్ల వైసీపీ జెండా రంగులు..జగన్ ఫొటో ముద్రించింది.
విద్యా వ్యవస్థను రాజకీయాల్లోకి గత ప్రభుత్వం లాగిందని ఉపాధ్యాయులు కూడా పలు సందర్భాల్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై ఏపీ విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ స్పందించారు.
విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తోందని లోకేష్ అన్నారు. గత ప్రభుత్వంలో ఫొటోలు, పేర్లు, రంగుల పిచ్చి చూశారని, తాను మంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వంలో విద్యాశాఖా మంత్రి అయిన తన ఫొటో గానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఫొటో గానీ ఎక్కడా ఉండకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశానని లోకేష్ అన్నారు.
ఈ కార్యక్రమంలో కూడా ఎక్కడా తన ఫొటో, చంద్రబాబు గారి ఫొటో లేదని గుర్తు చేశారు. విజయవాడలో జరిగిన జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న అధ్యాపకులను గత ప్రభుత్వం మద్యం షాపుల ముందు నిలబెట్టిందని లోకేష్ ధ్వజమెత్తారు. తాము ఉపాధ్యాయులను గౌరవిస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు సిలబస్ కన్నా యాప్‌ల పనే ఎక్కువగా ఉందని, తమ ప్రభుత్వంలో అలా ఉండబోదని చెప్పారు. ఆత్మలతో మాట్లాడే ముఖ్యమంత్రి ఉండడం వల్ల ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారని జగన్ పై లోకేష్ సెటైర్లు వేశారు.
This post was last modified on November 12, 2024 5:04 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…