తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో సోమవారం ఫార్మా సిటీ నిర్మాణానికి సంబంధించిన భూములను పరిశీలించేందుకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్ పై మహిళ ఒకరు చేయి చేసుకున్న విషయం బయటకు వచ్చింది.
ఈ దాడిలో కలెక్టర్ పక్కనే ఉన్న నీటి మడుగులో కూడా పడిపోయారు. ఇది పెను విధ్వంసానికి దారి తీసింది. 55 మందిని పోలీసులు అరెస్టు చేశారు. చాలా మంది పై రౌడీ షీట్లు తెరిచేందుకు రెడీ అయ్యారు. ఇక, పెరిచర్ల గ్రామంలో 114 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే.. అప్రకటిత కర్ఫ్యూ ఇక్కడ అమలు జరుగుతోంది. అయితే.. ఇప్పుడు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. “నాపై ఎవరూ దాడి చెయ్యలేదు” అని కలెక్టర్ ప్రతీక్ జైన్ తాజాగా యూటర్న్ తీసుకున్నారు.
అంతేకాదు.. ఇక్కడి రైతులు అందరూ మన వారే అంటూ ఆయన కామెంటు చేయడం గమనార్హం. కలెక్టర్‌పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. పెన్ డౌన్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులను ఆయన బుజ్జగించారు.
తనపై ఎవరూ దాడి చేయలేదని స్పష్టం చేసిన కలెక్టర్.. మాట్లాడేందుకు గ్రామస్థులు పిలిచారని.. చర్చలు జరిపామని వెల్లడించారు. అయితే.. ఇంతలో అల్లరి మూకలు హడావుడి చేశారని తెలిపారు. అంతా మన రైతులు అని, మావాళ్లు మనపై దాడి చేయరని కలెక్టర్ వ్యాఖ్యానించారు.
మరోవైపు ఘటనపై దర్యాప్తు జరుగుతోందని..ఎవరూ ఆందోళన చేయవద్దని సూచించారు. అయితే.. కలెక్టర్ చెప్పింది నిజమైతే.. ఆయన కింద ఎందుకు పడిపోయారు..? తర్వాత రణరంగంగా ఎందుకు మారిందనేది ప్రశ్న.
ఇదిలావుంటే.. రేవంత్‌రెడ్డి సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫార్మా సిటీ ఏర్పాటు విషయంలో తలెత్తిన ఈ వివాదం సిటీ ఏర్పాటుపైనే నీలినీడలు ముసురుకునేలా చేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
దీంతో ప్రభుత్వ సూచనల మేరకే కలెక్టర్ యూరట్న్ తీసుకున్నారనేది రాజకీయ వర్గాల మధ్య చర్చ నడుస్తోంది. స్థానికులను బుజ్జగించి.. వారినుంచి భూములు తీసుకునేందుకు సర్కారు చేస్తున్న ప్రయత్నంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
This post was last modified on November 12, 2024 5:26 pm
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…