ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పాటులో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ పెద్దలకు, ఏపీ సీఎం చంద్రబాబుకు మధ్య వారధిలా పనిచేసిన పవన్ కల్యాణ్ కూటమి ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయ్యారు.
అంతేకాకుండా, ఏపీలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వంటి అగ్రనేతలను తీసుకురాగలిగారు. ఇటు, ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఎన్డీఏ విజయ దుందుభి మోగించడం, ఏపీలో కూటమి తరపున గెలుపొందిన ఎంపీలు మోదీ సర్కార్ ఏర్పాటులో కీలకం కావడంతో పవన్ ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలోనే పవన్ ను ఆంధీ అనే ప్రధాని మోడీ కూడా ప్రశంసించారు.
ఈ క్రమంలోనే ఈ తుఫానును మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండు రోజులు పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజెపి తరపున జానసేనా అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నారు.
తెలుగు వారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ ఈ నెల 16, 17 తేదీల్లో బీజేపీ తరపున ప్రచారం చేయబోతున్నారు. ఇందుకోసం బీజేపీ సీనియర్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కు ఉన్న సినీ గ్లామర్ తో పాటు సనాతన ధర్మం కోసం పవన్ చేస్తున్న పోరాటం వంటి విషయాల నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ కీలకంగా మారబోతున్నారని తెలుస్తోంది.
This post was last modified on November 12, 2024 4:28 pm
హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన పుష్ప 2 ది రూల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాస్…
కన్నడ మూవీ కిస్ తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. దర్శకేంద్రుడు తెరకెక్కించిన పెళ్లి సందడి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో…
తెలంగాణలో టికెట్ ధరల పెంపు, జీవోలు వచ్చేసి ఆన్ లైన్ అమ్మకాలు మొదలయ్యాక కూడా ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఆలస్యం…
కిక్కిరిసిపోయిన అభిమాన జనసందోహం మధ్య పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో ఘనంగా…
పెద్ద హీరోల సినిమాలు మొదటి రెండు వారాలు చూడటం కష్టమనిపించేలా పుష్ప 2 టికెట్ రేట్లకు విపరీతమైన హైక్ ఇవ్వడం…
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి పది మాసాలే అయిందని.. ఈ పది మాసాల్లోనే అద్భుతాలు జరిగిపోతాయా? అని సీఎం…