ఏపీ కలల రాజధాని అమరావతికి నిధుల అడ్డంకులు దాదాపు తొలిగిపోయాయి. అటు రుణం రూపంలో కొంత.. ఇటు బడ్జెట్ కేటాయింపులు మరికొంత.. బాండ్లు విక్రయించడం ద్వారా ఇంకొంత సొమ్మును సమీకరించుకునేందుకు సర్కారు ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అన్నీ సమకూ రేందుకు మార్గం రెడీ అయింది. అమరావతి పూర్తిస్థాయి నిర్మాణానికి లక్ష కోట్ల వరకు కావాల్సి ఉంది. అయితే.. ఈ మొత్తాన్ని రెండు దశలుగా విభవించారు.
తొలి దశలో 50 వేల కోట్లను, మలిదశ(అంటే దాదాపు సగానికిపైగా నిర్మాణాలు పూర్తవుతాయి)లో మిగిలిన మొత్తాన్ని సమకూర్చుకుని రాజధానిని పూర్తి చేయాలన్నది ప్రస్తుత ప్రణాళిక. దీని ప్రకారమే చంద్రబాబు సర్కారు ఆదిశగా అడుగులు వేసింది. కేంద్ర బడ్జెట్‌లో రూ.15000 కోట్లను ప్రకటించారు. ఇది అప్పు రూపంలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ఇవ్వనున్నారు. దీనిలోనూ 1400 కోట్ల వరకు కేంద్రం భరించనుంది. మిగిలిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి.
సో.. మొత్తంగా 15000 కోట్లు రానున్నాయి. ఇక, తాజాగా ప్రకటించిన స్వల్ప కాలిక బడ్జెట్(నవంబరు-మార్చి )లో 3445 కోట్ల రూపాయలను ప్రకటించారు. ఇవి రాష్ట్ర సొమ్ములు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం నుంచి కేటాయించనున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సొంతగా హడ్కో సంస్థ నుంచి మరో 12 వేల కోట్ల రూపాయలు తీసుకునేందుకు రెడీ అయింది. హడ్కో కూడా ఇస్తానని చెప్పింది. అంటే.. మొత్తంగా 30 వేల కోట్లకు పైగానే సొమ్ములు వచ్చేందుకు మార్గం సుగమం అయింది.
ఇవి కాకుండా.. రాజధాని బాండ్లను విక్రయించడం ద్వారా.. హ్యాపీ నెస్ట్ భవనాలను విక్రయించడం(ఉన్న త తరగతుల కుటుంబాలు నివసించేందుకు ఇళ్లు) ద్వారా 23 వేల కోట్లను సమీకరించనున్నారు. అంటే.. మొత్తంగా తొలి దశలో ప్రతిపాదించిన 50 వేల కోట్ల రూపాయలు సమీకరించుకునేందుకు చంద్రబాబు సర్కారు చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. అయితే.. ఇవన్నీ ఒక్కసారిగా కాకుండా.. విడతల వారీగా పనులు పూర్తికాగానే వచ్చేస్తాయి. ఎలా చూసుకున్నా.. అమరావతి నిర్మాణానికి 50 వేల కోట్ల రూపాయలు సమకూరనున్నాయి.
జంగిల్ క్లియరెన్స్..
గత ఐదేళ్ల వైసీపీ హయాంలో అమరావతిని పట్టించుకోకపోవడంతో ఇక్కడ తుమ్మ, పిచ్చిచెట్లు పెరిగిపో యి.. అడవిని తలపించింది. దీనిని క్లియర్ చేసేందుకు 38 కోట్ల రూపాయలను సర్కారు గతంలోనే కేటా యించింది. పనులు కూడా పూర్తవుతున్నాయి. నేడో రేపో.. జంగిల్ క్లియరెన్స్ పూర్తవుతుంది. అనంతరం.. రాష్ట్ర సర్కారు బడ్జెట్‌లో కేటాయించిన 3445 కోట్లతో పనులు ప్రాధమికంగా ప్రారంభించనుంది. తర్వాత.. ఒకటి రెండు రోజుల్లోనే ప్రపంచ బ్యాంకు నుంచి 25 శాతం చొప్పున అంటే 3 వేల కోట్లకు పైగానే సొమ్ములు అందనున్నాయి. దీంతో అమరావతి నిర్మాణాలు పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తున్నా యి. డిసెంబరులోనే టెండర్లను ఆహ్వానించి పనులు చేపట్టేలా సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.
This post was last modified on November 12, 2024 1:51 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…