ఏపీ అసెంబ్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేయడం తో రాత్రికి రాత్రి ఫుడ్ కాంట్రాక్టర్‌ను అధికారులు తప్పించేశారు. వాస్తవానికి ప్రతి మూడేళ్లకు ఒకసారి కాంట్రాక్టర్‌ను మారుస్తారు. ఇలా చూస్తే.. ఇప్పటి వరకు ఆహారం అందించిన కాంట్రాక్టర్ వచ్చి ఏడాది కూడా కాలేదు. కానీ, సోమవారం బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. ఏర్పాటు చేసిన భోజనం నాణ్యతగా లేదన్న ఫిర్యాదులు రావడంతో స్పీకర్ ఆగ్రహించడం.. ఆవెంటనే కాంట్రాక్టర్‌ను మార్చేయడం గంటల్లోనే జరిగిపోయింది.
ఏం జరిగింది?
బడ్జెట్ సమావేశాల సందర్భంగా సుమారు 500 మందికి భోజనాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే.. ఈ క్రమంలో అన్నంలో నాణ్యత లోపించిందన్న విమర్శలు వచ్చాయి. ఇవి స్పీకర్ వరకు చేరాయి. దీంతో అసెంబ్లీ భోజనంపై నిన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులకు వేరుగా, ఇతరులకు వేరుగా భోజనం పెట్టారా అంటూ నిలదీశారు. దీనిపై చర్చ కూడా జరిగింది. అసెంబ్లీ అంటే తమాషా అనుకుంటున్నారా అంటూ అధికారులు, కాంట్రాక్టర్ ను స్పీకర్ నిలదీశారు.
ఈ పరిణామాల క్రమంలోనే ఫుడ్ సరఫరా చేసే పాత కాంట్రాక్టర్ ను మార్చివేశారు. మంగళవారం నుంచి కొత్త ఫుడ్ కాంట్రాక్టర్ కు భోజనం సరఫరా చేసే బాధ్యత అప్పగించారు. ఈ పరిణామంపై ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా స్పీకర్‌ను అభినందించారు. మంచి పనిచేశారని కొనియాడారు.
This post was last modified on November 12, 2024 1:49 pm
రాష్ట్రంలో కాంగ్రెస్ భవితవ్యం ఏంటి? మున్ముందు పార్టీ పుంజుకునే పరిస్థితి ఉంటుందా? ఇదీ.. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చర్చిస్తున్న…
ఇటీవలే చెన్నైలో జరిగిన పుష్ప 2 ది రూల్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో దేవిశ్రీ ప్రసాద్ ప్రసంగం ఎంత దుమారం…
ఇద్దరు మహిళా నాయకులు పదవుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే టికెట్లు దక్కక ఉసూరు మంటున్న వీరు.. ఇప్పుడు నామినేటెడ్…
ఊహలు గుసగుసలదే మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి రాశిఖన్నా. ఈ టాలీవుడ్ బ్యూటీ…
ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటూ, ప్రతి ప్రాజెక్ట్ను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా…
ఇప్పటి వరకు వైసీపీకి చెందిన పలువురు కీలక నాయకులపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. వీరిలో జోగి రమేష్ సహా…