జాతీయ విద్యాదినోత్సవాన్ని విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఉత్తమ అధ్యాపక, ఉపాధ్యాయులను ప్రభుత్వం సన్మానించింది. అవార్డు గ్రహీతలకు రూ. 20 వేల నగదు, షీల్డ్స్, శాలువాతో సత్కరించింది.
ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, విద్యా శాఖా మంత్రి లోకేష్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన లోకేష్ తన శాఖ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తనకు విద్యాశాఖ అప్పగించగానే తన సన్నిహితులు చాలామంది మెసేజ్ పెట్టారని, ఈ శాఖ నీకు అవసరమా అని వారించారని గుర్తు చేసుకున్నారు. స్టాన్ ఫోర్డ్ లో ఎంబీఏ చేసిన తాను ఈ శాఖను ఒక ఛాలెంజ్ గా తీసుకున్నానని, దేశంలోనే ఏపీ విద్యాశాఖను నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని వారికి తాను చెప్పానని లోకేష్ గుర్తు చేసుకున్నారు. కేరళ మోడల్, ఢిల్లీ మోడల్ కాదని, ఏపీ మోడల్ దేశానికి ఆదర్శంగా నిలిచేలా చేస్తానని చెప్పారు.
కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చి పటిష్టం చేస్తానని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మన వాళ్లు రాణించేలా మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తామని లోకేష్ చెప్పారు.
సమాజానికి ఉత్తమ పౌరులను అందించే బాధ్యత ఉపాధ్యాయులుదేనని, ప్రైవేటు పాఠశాలలకు డీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని లోకేష్ అన్నారు. తల రాతలు రాసేది బ్రహ్మ అయితే… తల రాత మార్చేది గురువులు అని, కానీ, అటువంటి ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు గత ప్రభుత్వం నిలబెట్టిందని గుర్తు చేసుకున్నారు. ఈ ప్రభుత్వం ఉపాధ్యాయులకు తగిన గౌరవం ఇస్తుందని చెప్పారు.
గత ప్రభుత్వంలో ఫొటోలు, రంగుల పిచ్చి చూశారని, ఈ ప్రభుత్వంలో ఎక్కడా తన ఫొటో, సీఎం ఫొటో పుస్తకంలో ఉండదని చెప్పారు. యాప్‌ల పనే ఉపాధ్యాయులుకు ఎక్కువ భారంగా మారిందని, ఇక నుంచి చిన్న లోపాలు ఉన్నా సరిదిద్దుకుంటామని చెప్పారు. రాత్రి ఆత్మలతో మాట్లాడి.. ఉదయం అనాలోచితంగా జీవో నంబర్ 117 తెచ్చిన ముఖ్యమంత్రి గతంలో ఉన్నారని జగన్ పై పరోక్షంగా సెటైర్లు వేశారు.
త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహించబోతున్నామని, మూడేళ్లల్లో ప్రతి స్కూల్లో అన్ని వసతులు ఉండేలా చూస్తామని హామీనిచ్చారు. రెండేళ్లు కష్టపడితే మన విద్యా వ్యవస్థ దేశంలోనే నెంబర్ వన్‌గా ఉంటుందని చెప్పారు.
This post was last modified on November 12, 2024 5:40 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…