Political News

‘జ‌గ‌న్ ఒక్క‌డు ఒక‌వైపు.. ప్ర‌జ‌లంతా మావైపు’

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల‌ను స‌జావుగా న‌డిపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు తెలిపారు. స‌భ‌కు రాని వారి సంగ‌తి ఏం చేయాల‌నే విష‌యాన్ని చ‌ట్టానికి వ‌దిలి పెట్ట‌నున్న‌ట్టు తెలిపారు. జ‌గ‌న్ ఒక్క‌డు ఒక‌వైపు.. ప్ర‌జ‌లంతా మావైపు ఉన్నారు. దీనిని బ‌ట్టి.. ఏం చేయాల‌నే విష‌యాన్ని చ‌ట్టం ప్ర‌కారం ఆలోచించి నిర్ణ‌యిస్తాం అని స‌భ‌కు రాకుండా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల విష‌యంపై స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. స‌భ‌లో ఉన్న‌వారికి మాట్లాడేందుకు అవ‌కాశం ఇవ్వ‌డంలో స‌భా సంఖ్యా బ‌లాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటామ‌న్నారు.

ఇది అన్ని స‌భ‌ల్లోనూ ఉన్న‌దేన‌ని చెప్పారు. కొత్త‌గా మాకు రూల్స్ ఉండ‌వు. స‌భ‌లో ఎవ‌రెవ‌రికి ఎంతెంత స‌మ‌యం ఇవ్వాల నేది రూల్స్ ఉన్నాయి. వాటి ప్ర‌కారం న‌డుచుకుంటాం. మేం కొత్త‌గా రూల్స్ సృష్టించేది లేదు. స‌భ‌కు రావాల‌ని ప్ర‌తిప‌క్ష నేత‌ను గ‌తంలోనే విన్న‌వించాను. ఇప్పుడు కూడా మా అధికారులు రెండు సార్లు స‌మాచారం అందించారు. దీనిలో మా వైపు ఎలాంటి త‌ప్పులేదు. అస‌లు స‌భ‌కే రాకుండా .. మైకు ఇవ్వాలంటే.. ఎలా? అని అయ్య‌న్న ప్ర‌శ్నించారు. స‌భ‌కు వ‌చ్చిన వారు.. ప్ర‌జ‌ల త‌ర‌ఫున మాట్లాడ‌తామంటే.. మైకు ఇచ్చేందుకు మేం సిద్ధంగానే ఉన్నామ‌న్నారు.

ఇక‌, ప్ర‌స్తుత ఎమ్మెల్యేల్లో చాలా మంది కొత్త‌వారు ఉన్నార‌ని చెప్పిన అయ్య‌న్న‌.. వారికి ఆదివారం , సోమ‌వారం ఉద‌యం వ‌ర‌కు కూడా.. శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్టు తెలిపారు. ముఖ్యంగా బ‌డ్జెట్‌లో ని అనేక అంశాలు క్లిష్టంగా ఉంటాయ‌ని… వాటిని తెలుసుకునేం దుకు ఎమ్మెల్యేల‌కు స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు. ఇలాంటి స‌మ‌యంలో వారికి బ‌డ్జెట్ ప్ర‌సంగంపైనా బ‌డ్జెట్‌లోని అంశాల‌పై వివ‌ర‌ణ ఇచ్చేందుకు శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్టు చెప్పారు. దీనికి అంద‌రూ రావాల‌ని పిలుపునిచ్చారు. ఇక‌, కూట‌మి పార్టీల ఎమ్మెల్యేల‌కు ప్ర‌త్యేకంగా స‌మావేశం ఏర్పాటు చేసి.. కొత్త‌వారు ఎలా మాట్లాడాలో చెబుతామ‌న్నారు.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న స‌మావేశాల‌ను కీల‌క‌మైనవి పేర్కొన్న స్పీక‌ర్ అయ్య‌న్న‌.. ఈ స‌మావేశాలు రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తా యన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి బాట ప‌ట్టించేందుకు ప్ర‌భుత్వం ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబు ఎంతో కృషి చేస్తున్నార‌ని తెలిపారు. బ‌డ్జెట్ బాగుంద‌నేది త‌న వ్య‌క్తిగ‌తఅభిప్రాయంగా వెల్ల‌డించారు. ఎవ‌రి అభిప్రాయాలు వారికి ఉంటాయ‌ని.. వాటిని తాను త‌ప్పుబ‌ట్ట‌న‌ని చెప్పారు. అయితే.. ప్ర‌స్తుతం వ‌చ్చే ఐదుమాసాల‌కు మాత్ర‌మే బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టిన నేప‌థ్యంలో దీనిలో పేర్కొన్న అన్ని విష‌యాలు బాగానే ఉన్నాయ‌ని భావిస్తున్న‌ట్టు చెప్పారు. ఇది సంక్షేమ‌, అభివృద్ధి బ‌డ్జెట్ అని వ్యాఖ్యానించారు.

This post was last modified on November 11, 2024 9:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘హైదరాబాద్ హౌస్’లో పుతిన్ బస.. ఈ ప్యాలెస్ ఎవరిదో తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…

25 minutes ago

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

3 hours ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

4 hours ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

6 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

7 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

8 hours ago