వైసీపీ సోషల్ మీడియాలో విర్రవీగి.. అసభ్య పదజాలంతో దూకుడు ప్రదర్శించి.. అదే గొప్పగాఫీలైన వారి భరతం పట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ క్రమంలో వైసీపీ సోషల్ మీడియాలో బూతులను మించిన స్థాయిలో పచ్చి కారుకూతలతో రెచ్చిపోయిన వర్రా రవీంద్రారెడ్డి సహా సుబ్బారెడ్డి, ఉదయ్‌లను తాజాగా కర్నూలు జిల్లా పోలీసులు, కడప జిల్లా అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు.
ఈ క్రమంలో అసలు వీరి టార్గెట్ ఎవరు? ఏంటి? అనే విషయాలను రాబట్టారు. సోషల్ మీడియాలోనూ పోటీ నెలకొన్న నేపథ్యంలో తమ పేరు మరింత ప్రచారంలోకివచ్చేందుకు వర్రా రవీంద్రారెడ్డి ప్రయత్నించాడు.
ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాదికారులే చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ప్రచారం పొందేందుకు.. నేతల భార్యలను, కుటుంబంలోని లేడీస్‌ను టార్గెట్ చేసుకున్నారని వివరించారు. ముఖ్యంగా వర్రా రవీంద్రారెడ్డి గతంలో భారతీ సిమెంట్ కంపెనీలో చిరుద్యోగిగా జీవితాన్ని ప్రారంబించారని తెలిపారు. 2012లో ఆయన సోషల్ మీడియా ప్లాట్ ఫాంలోకి వచ్చారని.. తర్వాత కాలంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నించారని చెప్పారు. ఈ క్రమంలో 2020 నుంచి ఇష్టానుసారంగా చెలరేగిపోయినట్టు తెలిపారు. సాధారణ పోస్టులను పెద్దగా ఎవరూ చూడడం లేదని భావించి.. నేతల కుటుంబాలను టార్గెట్ చేసుకున్నారని వివరించారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి విపక్ష నాయకుడు చంద్రబాబు సహా ఆయన సతీమణి భువనేశ్వరి, అదేవిధంగా ఆయన కోడలు, మంత్రి నారాలోకేష్ సతీమణి బ్రాహ్మణి, టీడీపీ నాయకుడు, ఎమ్మెల్యే బాలయ్య సతీమణి, కుటుంబ సభ్యులను పచ్చి బూతుల తో సోషలో మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పారు.
అంతేకాకుండా.. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులు, మంత్రి అనిత కుటుంబం సహా ఇతర నేతల కుటుంబాల్లోని మహిళలను టార్గెట్ చేసుకుని రెచ్చిపోయారన్నారు. ఇలా నేతల కుటుంబాల్లోని మహిళలను లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్రా సోషల్ మీడియా చెలరేగిపోయిం దన్నారు.
అదేవిధంగా కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పిఏ కనుసన్నల్లోనే ఈ గ్యాంగ్ రెచ్చిపోయినట్టు పోలీసులు తెలిపారు. అయితే.. ఎంపీ చెబితే చేశారా? లేదా? అనేది విచారణలో తేలాల్సి ఉందన్నారు. ప్రస్తుతం వర్రాపై 26 కేసులు నమోదయ్యాయని, ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులేనని వివరించారు.
This post was last modified on November 11, 2024 9:23 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…