ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఏపీ పునర్నిర్మాణం, పేదల సంక్షేమం లక్ష్యంగా, ఏపీ అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపుదిద్దుకుందని తెలుస్తోంది. శాసనసభలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.2.90 లక్షలతో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బడ్జెట్ కు సంబంధించిన పత్రాలను పయ్యావుల కేశవ్ కు ఆర్థిక శాఖ అధికారులు అందించారు. అక్కడి నుంచి అసెంబ్లీకి పయ్యావుల బయలుదేరారు.
ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం 2024 ఆగస్టు నుంచి నవంబరు వరకు 1.30 లక్షల కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ నెలాఖరుతో గడువు ముగియనుండడంతో తాజాగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఈ రోజు ఉదయం బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. శాసన సభలో అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు. 10 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
This post was last modified on November 11, 2024 10:38 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…