Political News

డిప్యూటీ సీఎంతో డీజీపీ భేటీ.. విష‌యం సీరియ‌స్సేనా?

సాధార‌ణంగా ఏ రాష్ట్రంలో అయినా.. డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్‌(డీజీపీ) ముఖ్య‌మంత్రి, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని మాత్ర‌మే క‌లుసుకుంటారు. వారితోనే నిరంత‌రం ట‌చ్‌లో ఉంటారు. ఇక‌, హోం మంత్రిగా ఎవ‌రున్నా.. శాంతి భ‌ద్ర‌త‌ల విభాగం ముఖ్య‌మంత్రు ల చేతుల్లోనే ఉంటున్న నేప‌థ్యంలో డీజీపీల‌కు హోం మంత్రుల‌కు మ‌ధ్య పెద్ద‌గా యాక్స‌స్ ఉండ‌డం లేదు. దీంతో ముఖ్య‌మంత్రి తోనే పోలీస్ బాస్‌కు ప్ర‌త్య‌క్ష సంబంధాలు ఉంటున్నాయి. అది ఏపీ అయినా.. తెలంగాణ అయినా..తమిళ‌నాడు, క‌ర్నాట‌క అయినా.. ఒకే ప‌ద్ధ‌తి ప్ర‌స్తుతం క‌నిపిస్తోంది. ఇక‌, డిప్యూటీ సీఎంల‌తో అయితే.. డీజీపీకి పెద్ద‌గా సంబంధం ఉండ‌దు.

కానీ, అనూహ్యంగా ఏపీలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌తో డీజీపీ ద్వార‌కా తిరుమ‌ల రావు భేటీ కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఒక‌వైపు.. శాంతి భ‌ద్ర‌త‌లు లోపించాయ‌ని.. మంత్రి వంగ‌ల‌పూడి అనిత స‌రిగా ప‌నిచేయ‌డం లేద‌ని డిప్యూటీసీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆరోపించిన త‌ర్వాత‌.. అనేక చ‌ర్చ‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. ఇంకోవైపు.. సోష‌ల్ మీడియాలో చెల‌రేగుతున్న మూక‌లను క‌ట్టి చేస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో డీజీపీ తొలిసారి(ఐదు నెల‌ల కాలంలో) నేరుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆఫీసుకు వ‌చ్చి.. ఆయ‌న‌తో భేటీ కావ‌డం అత్యంత ప్రాధాన్యం సంత‌రించుకుంది.

ప్ర‌స్తుతం హోం శాఖ‌లోని కీల‌కమైన‌ శాంతి భ‌ద్ర‌త‌ల విభాగం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ‌ద్దే ఉంది. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ తానే హోం మంత్రి అయితే.. ప‌రిస్థితి చాలి భిన్నంగా ఉంటుంద‌ని వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో రెండు రోజుల కింద‌ట జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యం చ‌ర్చకు వ‌చ్చింది. ఈ స‌మ‌యంలోనే శాంతి భ‌ద్ర‌త‌ల‌ను అద‌నంగా ప‌వ‌న్‌కు ఏమైనా అప్ప‌గించి ఉంటారా? అనేది తాజాగా జ‌రిగిన ప‌రిణామాల‌ను బ‌ట్టి.. చ‌ర్చ‌కు వ‌స్తోంది. లేక‌పోతే.. డీజీపీకి., ప‌వ‌న్ చూస్తున్న అట‌వీ, పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల‌కు ఎలాంటి సంబంధం లేదు. అయినా.. ఆయ‌న వ‌చ్చి క‌లిశారంటే ఏదో జ‌రిగి ఉంటుంద‌న్న‌ది ప్ర‌ధాన చ‌ర్చ‌.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో సోష‌ల్ మీడియాలో చెల‌రేగిన వారిని అరెస్టు చేస్తున్నారు. మ‌రో వైపు హైకోర్టు అక్ర‌మ నిర్బంధాలు చేస్తున్నా ర‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇంకోవైపు.. వైసీపీ అధినేత మాజీ సీఎం జ‌గ‌న్‌.. రాష్ట్రంలో భావ ప్ర‌క‌ట‌న‌ను అణిచి వేస్తున్నార‌ని ఆరోపించారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ప‌వ‌న్ కోసం డీజీపీ రావ‌డం, ఆయ‌న‌తో చ‌ర్చించ‌డంవంటివి చూస్తే.. రాష్ట్రంలో కీల‌క‌మైన శాంతి భ‌ద్ర‌త అంశాన్ని చంద్ర‌బాబు నేరుగా ప‌వ‌న్‌కు అప్ప‌గించారా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఏదేమైనా.. ఇప్పుడు జ‌రిగిన భేటీపై మాత్రం రాజకీయ వ‌ర్గాల్లోనూ.. ముఖ్యంగా కూట‌మి పార్టీల్లోనూ ఆస‌క్తికర చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 10, 2024 10:40 am

Share

Recent Posts

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

3 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

3 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

4 hours ago

టార్గెట్ గ‌జ్వేల్‌.. కాంగ్రెస్ వ్యూహం ఇదీ!

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట‌. అయితే.. ఇక్క‌డే పాగా వేయాల‌ని.. వ‌చ్చే…

4 hours ago

మొహమాట పడితే ఎలాగయ్యా సట్టపులి

తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…

5 hours ago

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

11 hours ago