మూసీ నది ప్రక్షాళన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ నదిని సుందరీకరించి తీరుతామని చెప్పారు. ఈ క్రమంలో కొందరు బుల్డోజర్లకు అడ్డంగా వస్తామని, అడ్డుకుంటామని ప్రకటిస్తున్నారని.. ఇలాంటివారిని అదే బుల్డోజర్‌తో తొక్కించేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ‘మూసీ పునరుజ్జీవ యాత్ర’ పేరిట కాంగ్రెస్ నాయకులు యాత్ర చేపట్టారు. అనంతరం.. నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. మూసీ ప్రక్షాళనను తమాషా అనుకుంటున్నారని, దీనిని చేపట్టడం చేతకాని వారు.. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని గత బీఆర్ ఎస్ సర్కారు నాయకులపై ఆయన విమర్శలు గుప్పించారు.
“మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటామని బీరాలు పలుకుతున్నరు. వాళ్లెవరో ముందుకు రావాలి. మంత్రి వెంకటరెడ్డన్నతోనే తొక్కించేస్తా” అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. మూసీ ప్రక్షాళన జరిగి తీరుతుందన్నారు. ఎవరూ ఆపలేరని చెప్పారు. ప్రజలు తమను ఎన్నుకున్నది చేతులు ముడుచుకుని కూర్చునేందుకు కాదన్నారు. ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తామని చెప్పారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌పైనా విమర్శలు గుప్పించారు. తన కుమార్తె కవిత జైల్లో ఉంటే ఏడ్చిన ఆయన.. నల్లగొండ వాసులు మూసీ కాలుష్యంతో అల్లాడుతుంటే ఏడుపు రాలేదా? అని నిలదీశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను బిర్లా-రంగాలతో పోల్చి చూపారు. వారి వైపు ప్రజలు ఉండరని వ్యాఖ్యానించారు. ప్రజలకు మేలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీవైపే ప్రజలు నిలబడతారని అన్నారు. సంగెం శివయ్య(సంగమేశ్వర్వుడు) సాక్షిగా.. మూసీ నదిని ప్రక్షాళన చేసి తీరుతామని రేవంత్ చెప్పారు. సుమారు 2.5కిలో మీటర్ల మేరకు మూసీ పునరుజ్జీవ యాత్రనుచేపట్టిన అనంతరం.. ఆయన సంగమేశ్వరుడిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో శివయ్య ప్రస్తావన తీసుకువస్తూ.. “సంగెం శివయ్య సాక్షిగా చెబుతున్నా మూసీ నది ప్రాజెక్టును తప్పకుండా పూర్తి చేసి తీరుతా” అని రేవంత్ స్పష్టం చేశారు.
మూసీతో మసి!
మూసీ నది కారణంగా ప్రజల జీవితాలు మసిబడుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పాలు,నీళ్లు నిత్యావసరాలు సహా అన్నీ కలుషితమేనని చెప్పారు. ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు తాను నడుంబిగించానన్నారు. “మూసీ పరివాహకంలో పండే పంటలు కూడా కలుషితం అయ్యాయి. వీటిని తింటే రోగాలు వస్తున్నాయి. నల్గొండ జిల్లాలో ఓవైపు ఫ్లోరైడ్, మరోవైపు కలుషిత మూసీ ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితి మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఎంత ఖర్చయినా.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. చేసి తీరుతాం” అని సీఎం వ్యాఖ్యానించారు.
This post was last modified on November 8, 2024 9:15 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…