రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ఏపీ సీఎం చంద్రబాబు అహర్నిశలు పాటుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా చంద్రబాబు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అమరావతిలో నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు నిర్మించిన గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ ను చంద్రబాబు ప్రారంభించారు. 500 కోట్ల వ్యయంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసిన ఈ సబ్ స్టేషన్ ను చంద్రబాబు ప్రారంభించారు. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 6000 కోట్ల రూపాయల విలువైన విద్యుత్ పనులను చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు.
ఆ తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు… వైసీపీ నేతలపై, మాజీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని వైసీపీ సోషల్ మీడియాకు చంద్రబాబు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఏ ముసుగు వేసుకొని నేరస్థులు వచ్చినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైసీపీ నేతల ఇళ్ళలోని ఆడబిడ్డలు ఆ పోస్టులు పెట్టే వారిని ప్రశ్నించాలని చంద్రబాబు సూచించారు. కొంతమంది మదం, కొవ్వు ఎక్కి సోషల్ మీడియాలో అధికార పార్టీ నేతలపై, వారి ఇళ్లలోని ఆడవాళ్ళపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు.
తన కుటుంబ సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్ కుమార్తెలపై కూడా అభ్యంతరకర పోస్టులు పెట్టారని గుర్తు చేసుకున్నారు. ఈ విషయంలో పవన్ ఎంతో బాధ పడ్డారని అన్నారు. తమను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకు అటువంటి పోస్టులు పెట్టిన వారిని వదిలిపెట్టాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ సొంత పత్రిక సాక్షిలో అసత్య కథనాలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేక హత్య రోజు సాక్షి పత్రికలో వెలువడిన కథ, గుండెపోటు అంటూ రాసిన వైనం అందరికీ తెలుసన్నారు.
తనతో ఆడుకోవాలని చూస్తే ఎవరిని వదిలిపెట్టబోనని హెచ్చరించారు. కొవ్వు పట్టిన వారి కొవ్వు తగ్గిస్తానని, పోలీసు వ్యవస్థ కూడా ఆలోచించుకోవాలని చంద్రబాబు చెప్పారు. నేరస్తుల కన్నా అప్పర్ హ్యాండ్ పోలీసులదే ఉండాలని పోలీసులకు చంద్రబాబు సూచించారు. ఆనాడు తన భార్య గురించి అసభ్యకరంగా మాట్లాడితే ఎంతో బాధపడ్డానని, బాంబులకు కూడా భయపడని తాను తన భార్య గురించి అసభ్యకరంగా మాట్లాడితే ఎమోషనల్ అయి కన్నీరు పెట్టానని గుర్తు చేసుకున్నారు.
వైసీపీ వాళ్ళకి 11 సీట్లు కాదని, ఒక్క సీటు కూడా గెలిచే అర్హత లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. తనతోపాటు తన కుటుంబం, పవన్…ఆయన కుటుంబం, హోం మంత్రి అనిత…ఆమె కుటుంబం పై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని, హద్దులు మీరి ప్రవర్తిస్తే వదిలిపెట్టబోనని వార్నింగ్ ఇచ్చారు. రాజకీయం ముసుగులో నేరస్థులు ఘోరాలు చేస్తున్నారని, అదేంటిని ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛ అంటున్నారని విమర్శించారు. అంటే ఆడపిల్లల వ్యక్తిత్వాన్ని హననం చేయడం, అసభ్యకరంగా, అశ్లీలంగా పోస్టులు పెట్టడం భావ ప్రకటన స్వేచ్ఛా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏ చట్టం ఈ రకమైన హక్కు ఇచ్చిందని ప్రశ్నించారు. ఈ తరహా పోస్టులపై సీరియస్ గా ఆలోచించి పకడ్బందీ చట్టం తీసుకొస్తామని అన్నారు.
This post was last modified on November 8, 2024 10:13 am
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…