నిన్న మొన్నటి వరకు ఆస్తుల వివాదాలతో తీరిక లేకుండా గడిపిన కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా రూట్ మార్చారు. రాజకీయంగా దూకుడు కూడా పెంచారు. కూటమి సర్కారుపై ఒకరకంగా యుద్ధాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో ఈ నెల నుంచి అమల్లోకి వచ్చిన విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ.. షర్మి ల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయవాడలో ధర్నా చేశారు. దీనికి మీడియా సపోర్టు ఎలా ఉన్నా.. ప్రజల నుంచి మాత్రం బాగానే రెస్పాన్స్ కనిపించింది.
వాస్తవానికి నాయకులకు కావాల్సింది కూడా ఇదే. దీంతో షర్మిల రాజకీయంగా తీసుకున్న స్టెప్‌తో నిన్న మొన్నటి వరకు ఆమెపై పడిన కుటుంబం కోసం రాజకీయాల్లోకి వచ్చారన్న వాదనను దాదాపు పక్కకు జరిగిపోయింది. ఇక, ఇప్పుడు పూర్తిస్థాయిలో నాయకురాలిగా కూడా షర్మిల అరంగేట్రం చేసినట్టు అవుతుంది. అయితే.. ఆమె ఈ ఊపును కొన్నాళ్ల పాటైనా కొనసాగించాల్సిన అవసరం ఉంది. మధ్యలో చేజారితే మాత్రం ఇబ్బందే.
ఈ నేపథ్యంలో షర్మిల ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి. ఇక, ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ప్రజల తరఫున గళం వినిపించాల్సిన బాధ్యత వైసీపీపైనే ఉంది. కానీ, ఆ పార్టీ నాయకులు సొంత వ్యవహారాలు, కేసులతోనే కాలం కలిసి రాక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రజల సమ్యలను వారు పట్టించుకోవడం లేదన్న వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. ఖచ్చితంగా ఇలాంటి సమయంలో షర్మిల పుంజుకోవడం ఆశావహమే అవుతుంది.
అయితే.. ప్రజా ఉద్యమాలనే నమ్ముకుంటూ.. రాజకీయాలు చేస్తే బాగానే ఉంటుంది. కానీ, మధ్యలో కనుక దారిమళ్లితే.. షర్మిలపై పడిన ఆస్తుల ముద్ర పోవడం అంత ఈజీకాదు. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై ఆమె అలుపెరుగని పోరాటాలకు దిగితేనే భవిష్యత్తులో ఆమెను నాయకురాలిగా ప్రజలు స్వీకరించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గమనంలో పెట్టుకుని వేసే ప్రతి అడుగు ప్రజల సమస్యల దిశగా నడిస్తే.. షర్మిల వైసీపీని రీప్లేస్ చేసే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
This post was last modified on November 7, 2024 11:55 am
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…