Political News

పిఠాపురంలో ప‌వ‌న్ మ‌కాం.. రీజ‌నేంటి?

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సోమ‌వారం నుంచి రెండు రోజుల పాటు త‌న సొంత నియోజ‌కవర్గం పిఠాపురంలో మ‌కాం చేయ‌నున్నారు. గ‌త 15 రోజుల కింద‌టే ఆయ‌న ఇక్క‌డ ప‌ర్య‌టించారు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి ఆయ‌న హాజ‌ర‌య్యారు. అలాంటిది .. కేవ‌లం 15 రోజుల వ్య‌వ‌ధిలోనే మ‌రోసారి పిఠాపురంలో ఆయ‌న ప‌ర్య‌టించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. అయితే.. ఇది అధికారికంగా చేప‌డుతున్న ప‌ర్య‌ట‌నే అయినా.. వెనుక కీలక రాజ‌కీయ వ్య‌వ‌హారం ఉంద‌ని తెలుస్తోంది.

పిఠాపురం నియోజ‌క‌వర్గంలో టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన నాయ‌కుల మ‌ధ్య ఆధిప‌త్య పోరు సాగుతున్న విషయం తెలిసిందే. నాయ‌కుల మ‌ధ్య దాడులు కూడా చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వ‌ర్మపై ఇప్ప‌టికి రెండు సార్లు దాడులు జ‌రిగాయి. అయితే.. దీనివెనుక ఎవ‌రు ఉన్నార‌న్న విష‌యంపై మాత్రం గోప్య‌త పాటిస్తున్నారు. ఇక‌, ఇటీవ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను పుర‌స్క‌రించుకుని నిర్వ‌హించిన స‌మావేశంలోనూ.. జ‌న‌సేన నాయ‌కులు దూకుడు ప్ర‌ద‌ర్శించారు.

టీడీపీ నేత‌లు.. జ‌న‌సేన పార్టీ కండువాలు వేసుకోకుండా తిరుగుతున్నార‌ని.. రాష్ట్రంలో జ‌న‌సేన పార్టీ కూడా ప్ర‌భుత్వంలో భాగంగా ఉంద‌ని, అస‌లు ఈ పార్టీ లేక‌పోతే, ప్ర‌భుత్వం వ‌చ్చేది కాద‌న్న‌ది వారు బ‌హిరంగంగా చేస్తున్న ఆరోప‌ణ‌. ఈ నేప‌థ్యంలో ఇరు పార్టీల మ‌ధ్య స‌ఖ్య‌త స‌న్న‌గిల్లుతోంది. కీల‌క‌మైన, అందునా పార్టీ అధినేత ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పిఠాపురంలోనే మిత్ర‌ప‌క్షాల మ‌ధ్య ఇలా వివాదాలు చెల‌రేగుతుండ‌డంతో జ‌న‌సేన అధినేత అలెర్ట్ అయ్యారు.

సోమ‌వారం నుంచి రెండు రోజుల పాటు ఆయ‌న పిఠాపురంలోనే మ‌కాం వేసి.. నాయ‌కుల‌కు క్లాస్ ఇచ్చే ప‌నిని చేప‌ట్ట‌నున్నారు. మిత్ర‌ప‌క్షాల ఐక్య‌త‌, పొర‌పొచ్చాలు లేని స‌ఖ్య‌త అనే రెండు కాన్సెప్టుల‌ను వారికి వివ‌రించ‌నున్నారు. అదేవిధంగా క‌లివిడిగా ఉండాల్సినఅవ‌స‌రం కూడా ఆయ‌న వివ‌రించే అవ‌కాశం ఉంది. ఇక‌, అసంతృప్తితో ర‌గులుతున్న కొంద‌రు నాయ‌కుల‌ను కూడా ఆయ‌న బుజ్జ‌గించ‌డ‌మో.. లేదా వార్నింగ్ ఇవ్వ‌డ‌మో చేయ‌నున్నారు. మొత్తానికి ప‌వ‌న్ అయితే.. రంగంలోకి దిగుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on November 4, 2024 11:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నారా లోకేశ్ వెరీ వెరీ స్పెషల్.. !!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ నిజంగానే ప్రతి విషయంలోనూ వెరీ వెరీ స్పెషల్ అని…

48 minutes ago

బరాబర్ గద్దర్ కు పద్మ అవార్డు ఇవ్వం: బండి సంజయ్

భారత 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం రాత్రి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులపై తెలంగాణలో రచ్చ మొదలైంది.…

1 hour ago

సూక్ష్మదర్శిని స్ఫూర్తితో మర్డర్ ప్లాన్ ?

సమాజం మీద సినిమాలు, వెబ్ సిరీస్ ప్రభావం పాజిటివ్ గా ఏమో కానీ నెగటివ్ అయితే ఖచ్చితంగా ఉంటుందనే దానికి…

1 hour ago

రెండేళ్ల యువగళం!… లోకేశ్ విభిన్న లక్ష్యం సాకారం!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ గతంలో చేపట్టిన ప్రతిష్ఠాత్మక యువగళం పాదయాత్రకు నేటితో సరిగ్గా…

2 hours ago

వెంకటేష్ నిబద్దతకు సలామ్ కొట్టాల్సిందే

వస్తువైనా సినిమా అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెటింగ్ చాలా అవసరం. లేదంటే జనాలు పట్టించుకోకపోయే ప్రమాదముంది. ప్యాన్ ఇండియా మూవీకి…

2 hours ago

కొత్త సందేహాలకు తెర తీసిన వీరమల్లు

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మార్చి 28 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటికంతా…

2 hours ago