ఏపీ మాజీ సీఎం జగన్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళల మధ్య ఆస్తి వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే షర్మిలకు భద్రత పెంచాలని కోరుతూ ఏపీ డీజీపీ ద్వారకాతిరుమలరావుకు కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. షర్మిలకు ప్రాణహాని ఉందంటే భద్రత కల్పిస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే గతంలో వైఎస్ విజయమ్మకు సంబంధించిన ఒక ఘటన తాజాగా వెలుగులోకి వచ్చిన వైనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు విజయమ్మ ప్రయాణిస్తున్న కారు ఫ్రంట్ టైర్ లు రెండు ఒకేసారి ఊడిపోయిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రోడ్డు పక్కన విజయమ్మ ప్రయాణిస్తున్న ఖరీదైన కారు ముందు రెండు టైర్లు జాకీలు వేసి నిలబెట్టి ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఖరీదైన కొత్త కారు రెండు చక్రాలు ఒకేసారి ఊడిపోవడంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి.
ఈ వ్యవహారంపై టీడీపీ ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. లక్షల కోట్ల ఆస్తి ఉన్న జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ ప్రయాణిస్తున్న కారు ఇలా రోడ్డు పక్కన పడి ఉందని, ఆమెకు ఎటువంటి ప్రమాదం జరగలేదని టిడిపి పేర్కొంది. అయితే, ఇదంతా జరిగింది 2024 ఎన్నికలకు ముందు అని, ఆ ఈ ఘటన జరిగిన తర్వాత ఏడాదిపాటు విజయమ్మ అమెరికాలో ఉన్నారని ఆ ట్వీట్ లో పేర్కొంది. లోగుట్టు ఆ కుటుంబానికి ఎరుక అంటూ టీడీపీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2024 ఎన్నికలకు ముందు కూడా 2019 ఎన్నికలకు ముందు మాదిరే పెద్ద తలకాయను జగన్ టార్గెట్ చేశారేమోనని అనుమానాలు వ్యక్తం అవుతున్న సమయంలో ఈ ఘటన జరగడం విశేషం అని టిడిపి ట్వీట్ చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates