Political News

చంద్ర‌బాబు పెట్టిన టీ రుచి చూస్తారా త‌మ్ముళ్లు

నిత్యం విరామం లేని ప‌నుల‌తో.. క‌లుసుకునే అతిథుల‌తో బిజీబిజీగా ఉండే ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా టీ కాచారు. స్వ‌యంగా ఆయ‌నే పొయ్యి వెలిగించి.. దానిపై గిన్నె పెట్టి, పాల ప్యాకెట్ క‌ట్ చేసి, గిన్నెలో పోసి.. టీ పొడి, పంచ‌దార‌, యాలుక‌ల పొడి వేసి మ‌రిగించారు. అంతేకాదు.. మ‌రిగిన త‌ర్వాత‌.. త‌నే స్వ‌యంగా దానిని వ‌డ‌గ‌ట్టి.. గ్లాసుల్లో పోసి.. అంద‌రికీ అందించారు. ఈ చిత్ర‌మైన వ్య‌వ‌హారం.. శ్రీకాకుళం జిల్లాలోని మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజ‌క‌వ‌ర్గం ఇచ్ఛాపురంలో ఉన్న‌ ఈదుపురం లో గ్రామంలో జ‌రిగింది.

రీజ‌నేంటి?

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ల పంపిణీ ప‌థ‌కాన్ని చంద్ర‌బాబు శుక్ర‌వారం శ్రీకాకుళం జిల్లాలోని ఈదుపురంలో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప‌థ‌కం తొలి ల‌బ్ధిదారు రాలైన శాంత‌మ్మ ఇంటికి వెళ్లిన చంద్ర‌బాబు.. అక్క‌డే గ్యాస్ క‌నెక్ష‌న్ ఇచ్చారు. అనంత‌రం వారి ఇంట్లోనే.. పొయ్యి వెలిగించి.. అంద‌రి స‌మ‌క్షంలో త‌నే స్వ‌యంగా టీ కాచి వ‌డ‌బోసి అంద‌రికీ అందించారు. అయితే.. ఎంత చంద్ర‌న్న అయినా సీఎం కావ‌డం.. పైగా చుట్టూ సెక్యూరిటీ ఉండ‌డంతో శాంత‌మ్మ కుటుంబం ఒకింత బిక్కుబిక్కుమంది.

దీంతో వారిని కూల్‌గా ఉండాలని చెప్పిన చంద్ర‌బాబు టీ కాచడం గ‌మ‌నార్హం. టీ మ‌రుగుతున్న స‌మ‌యంలోనే ల‌బ్ధిదారు శాంత‌మ్మ‌తో చంద్ర‌బాబు సంభాషించారు. ఆమె కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉచిత గ్యాస్ ప‌థ‌కంపై ఆమె అభిప్రాయం తెలుసుకున్నారు. ఈ ప‌థ‌కంతో త‌మ క‌ష్టాలు తీరుతాయ‌ని శాంతమ్మ చెప్పడంతో చంద్ర‌బాబు మురిసిపోయారు.

ఈ బిల్లు మీదే!

టీ కాచిన త‌ర్వాత‌.. చంద్ర‌బాబు ఈ బిల్లు మీదే.. అంటూ.. స్పాట్‌లో ఉన్న కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి(సొంత జిల్లా కూడా ఇదే) కింరాజాపు రామ్మోహ‌న్ నాయుడిని ఉద్దేశించి చ‌మ‌త్క‌రించారు. దీనికి ఆయ‌న మాట్లాడుతూ.. స్టేట్ బ‌డ్జెట్ నుంచి చెల్లించ‌మంటారా? సెంట్ర‌ల్ బ‌డ్జెట్ నుంచి చెల్లించ‌మంటారా? అని న‌వ్వుతూ ప్ర‌శ్నించగా.. “నీ ఇష్టమని కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామన్నా అభ్యంతరం లేదు” అని అనేశారు. కాగా, చంద్ర‌బాబు చేతి టీ రుచి చూసేందుకు త‌మ్ముళ్లు ఎగ‌బ‌డ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 1, 2024 4:47 pm

Share

Recent Posts

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

1 hour ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

1 hour ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

2 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

4 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

6 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

8 hours ago