తెలంగాణలోనూ తెలుగు దేశం పార్టీని పరుగులు పెట్టించాలని భావిస్తున్న ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆదిశగా వడివడిగానే అడుగులు వేస్తున్నారు. వచ్చే సంక్రాంతిలోగా.. పార్టీ ని అన్ని రకాలుగా ముందుకు నడిపించే కీలక నాయకుల భర్తీపై ఆయన దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా.. ప్రధానమైన తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవిని ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలిసింది.
ఏపీలోను, తెలంగాణలోనూ.. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇస్తున్న విషయం తెలిసిందే. గతంలో కాసాని జ్ఞానేశ్వర్‌కు తెలంగాణలో పిలిచి మరీ పదవి కట్టబెట్టారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయడం లేదన్న కారణంతో ఆయన పార్టీకి దూరమై.. బీఆర్ ఎస్ కండువా కప్పుకొన్నారు. ఇక, ఇప్పుడు ఈ పదవిని మరోసారి భర్తీ చేసేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనూ బీసీనేతకే పెద్దపీట వేయాలని చూస్తున్నారు.
వాస్తవానికి తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి రేసులో ప్రముఖ హాస్యనటుడు బాబు మోహన్, జీహెచ్ ఎంసీ మాజీ మేయర్ తీగల క్రిష్ణారెడ్డి, అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన అరవింద్ కుమార్ గౌడ్ ఉన్నారు. నెల రోజుల క్రితం చంద్రబాబును కలిసిన బాబు మోహన్.. రెండ్రోజుల క్రితం టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. ఇక, ఇప్పటికే పార్టీలో చేరతానని చెప్పిన తీగల కృష్ణారెడ్డి కూడా ఈ పదవిని ఆశిస్తున్నారు. అయితే.. చంద్రబాబు మాత్రం బీసీ నాయకుడు అరవింద్ గౌడ్ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.
త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్జలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీసీ నాయకుడికి పగ్గాలు అప్పగించడం ద్వారా.. పార్టీని పుంజుకునేలా చేయొచ్చన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. ఇక, ఈ పదవిని ఆశిస్తున్నవారిలో తీగల కృష్ణారెడ్డి(ఇంకా చేరలేదు)కి ఉపాధ్య పదవిని, బాబూ మోహన్‌కు ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చే యోచన ఉందని తాజాగా తెలిసింది. దీపావళి సందర్భంగా చంద్రబాబు ఈ విషయంపై సుదీర్ఘ కసరత్తు చేశారని.. పేర్లను ఫైనల్ చేశారని సమాచారం.
This post was last modified on November 1, 2024 4:39 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…