ఫాపం.. బీజేపీ వీర విధేయులు…!

బీజేపీకి వీర విధేయులుగా ఉన్న చాలా మంది నాయ‌కుల్లో కొంద‌రి పరిస్థితి క‌క్క‌లేని, మింగ‌లేని స్థితిలో ఉంది. పార్టీ అధికారంలో ఉన్నా.. లేక‌పోయినా.. బీజేపీ కోసం ఎంతో శ్ర‌మించిన వారు ఉన్నారు. కీల‌క‌మైన బీజేపీ సిద్ధాంతాల‌ను కూడా ప్ర‌చారంలో పెట్టిన వారు కూడా ఉన్నారు. మ‌రీ ముఖ్యంగా తిరుమ‌ల శ్రీవారి ఆల‌యం విషయంలో బీజేపీలోని కొంద‌రు నాయ‌కులు.. చాలా అంకిత భావంతో వ్య‌వ‌హ‌రించారు.

నిరంత‌రం.. శ్రీవారి ఆల‌యం గురించే వారు ఆవేద‌న చెందారు. ఆల‌యంలో ఆచారాలు భ్ర‌ష్టు ప‌డుతున్నాయ‌ని, సంప్ర‌దాయాల‌కు విలువ లేకుండా పోతోంద‌ని.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేసిన వారు.. వాటి కోసం పోరాటాలు చేసిన వారు కూడా ఉన్నారు. వీరిలో తిరుప‌తికే చెందిన భాను ప్ర‌కాశ్ రెడ్డి, అదేవిధంగా అనంత‌పురానికి చెందిన బీజేపీ ప్ర‌తినిధులు కూడా ఉన్నారు. వీరి దృష్టి అంతా శ్రీవారి ఆల‌య బోర్డుపైనే ఉంది.

“ఈసారి మ‌న‌కు ఖాయం. అన్న మ‌న‌ల్ని కూర్చోబెడ‌తాడు” అని భావించిన ఇలాంటి ముగ్గురు న‌లుగురు కీల‌క నాయ‌కులు.. ఓ మంత్రిపై ఆశ‌లు కూడా పెట్టుకున్నారు.

అంతేకాదు.. మాజీ బీజేపీ చీఫ్ ద్వారా.. కేంద్రంలోని పెద్ద‌ల‌కు కూడా స‌మాచారం చేర‌వేశారు. టీడీపీ బోర్డులో స‌భ్య‌త్వం కోసం నానా ప్ర‌య‌త్నా లు చేశారు. తాము తిరుమ‌ల ప‌విత్ర‌త కోసం, తిరుమ‌ల కోసం ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌నిచేశామ‌ని చెప్పుకొన్నారు.

కానీ, ఫాపం.. ఈ బీజేపీ వీర విధేయుల ఆశ‌లు ఫ‌లించ‌లేదు. బీజేపీ నుంచి ఎవ‌రికీ ద‌క్క‌లేదు. కానీ, ఇదే బీజేపీ కోటాలో గుజ‌రాత్‌కు చెందిన కీల‌క వ్య‌క్తి డాక్ట‌ర్ అదిత్ దేశాయ్‌కు బోర్డులో స‌భ్య‌త్వం ద‌క్కింది. ఇలా ఈ ప‌ద‌వి ద‌క్క‌డం వెనుక‌.. కేంద్రంలోని బ‌ల‌మైన మంత్రి సిఫార‌సు ఉన్న‌ట్టు స‌మాచారం. అందుకే.. బీజేపీకి ఏపీ కోటాలో ఎవ‌రికీ అవ‌కాశం ద‌క్క‌క పోవ‌డం గ‌మ‌నార్హం. ఇది .. ఇప్ప‌టి వ‌ర‌కు వీర‌విధేయులుగా ఉన్న వారిని నిరాశ‌కు గురి చేసింద‌నే చెప్పాలి.