దేశంలో మరే రాజకీయ పార్టీ అధినేత వ్యవహరించని రీతిలో జనసేన అధినేత.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహరించారు.
ఏదైనా పర్వదినాలు వచ్చినప్పుడు.. ఆయా వర్గాల వారికి శుభాకాంక్షలు తెలపటం.. ఈ సందర్భంగా సందేశాన్ని ఇవ్వటం చేస్తారు. అందుకు భిన్నంగా పవన్ కల్యాణ్ మాత్రం కాస్తంత కొత్తగా వ్యవహరించారు. తన సోషల్ మీడియా ఖాతాలో దీపావళిని పురస్కరించుకొని ఒక పోస్టు పెట్టారు.
దీపావళి సందర్భంగా పాకిస్థాన్.. బంగ్లాదేశ్ లలో అణిచివేతకు గురవుతున్న హిందువుల కోసం మనమంతా ప్రార్థిద్దామని ఆయన పోస్టు పెట్టి కొత్త చర్చకు తెర తీశారు.
అక్కడితో ఆగని ఆయన మరో ఆసక్తికర అంశాన్ని షేర్ చేశారు. భారత్ – పాక్ విభజనకు సంబంధించి బాధతో ఒక బాలుడు ఆలపించిన చిట్టి వీడియోను షేర్ చేశారు. నిమిషం కంటే తక్కువ నిడివి ఉన్న ఆ వీడియోలో చిన్నారి బాలుడు భావోద్వేగంతోఏమ పాడిన పాట ఆకట్టుకునేలా ఉంది.
తన దీపావళి సందేశంలో పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..”ప్రస్తుతం మీరున్న పరిస్థితుల్లో ఆ శ్రీరాముడు మీకు ధైర్యాన్ని.. శక్తిని ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నా. మీ భద్రత.. స్థిరత్వం కోసం భారత్ లోని ప్రతి ఒక్కరం ఎదురుచూస్తున్నాం. పాకిస్థాన్.. బంగ్లాదేశ్ లో అణచివేతకు గురవుతున్న హిందువుల భద్రత.. వారి ప్రాథమిక హక్కులు కల్పించేందుకు యావత్ ప్రపంచం.. ప్రపంచ నేతలు కలిసి పని చేస్తారని ఆశిస్తున్నా. వారి కోసం మనమంతా ప్రార్థిద్దాం” అంటూ సరికొత్త దీపావళి సందేశానని పోస్టు చేశారు. ఆయన సందేశం కొత్త చర్చకు తెర తీస్తుందని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates