ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని ఏర్పాటు చేస్తూ.. ఏపీలోని కూటమి సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది. మొత్తం 24 మందితోకూడిన బోర్డును ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్‌గా ప్రముఖ మీడియా టీవీ-5 అధినేత బీఆర్ నాయుడుని ఎంపిక చేయడం గమనార్హం. ఈయన పేరు గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. మధ్యలో కొన్నాళ్లు మరికొందరి పేర్లు కూడా తెరమీదికి వచ్చాయి. ఎట్టకేలకు ఈయననే పాలక మండలి బోర్డు చైర్మన్‌గా నియమిస్తూ.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇక, మిగిలిన 23 మంది సభ్యుల్లో వైద్య రంగానికి చెందిన సుచిత్ర ఎల్లాకు ప్రాధాన్యం దక్కడం విశేషం. భారత్ బయోటెక్ సంస్థను స్థాపించిన కృష్ణా ఎల్లా సతీమణి సుచిత్ర ఎల్లా. కరోనా సమయంలో వ్యాక్సిన్ ను కనుగొన్న తొలి సంస్థగా ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగింది. తెలంగాణకు చెందిన ఈ సంస్థకు అంతర్జాతీయ ఖ్యాతి ఉండడం గమనార్హం. ఇక, వైసీపీ నుంచి ఎన్నికలకు ముందు టీడీపీ కండువా కప్పుకొన్న మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తికి కూడా.. బోర్డులో సభ్యత్వం దక్కింది. అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు కూడా.. అవకాశం కల్పించారు.
ఇక, నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి కూడా బోర్డులో ఉండనున్నారు. గత వైసీపీ హయాంలోనూ ఈమె బోర్డు సభ్యురాలిగా ఉండడం గమనార్హం. అదేవిథంగా తొలిసారి ఎస్సీ సామాజిక వర్గానికి టీటీడీ బోర్డులో అవకాశం కల్పించారు. అనంతపురం జిల్లా మడకశిర ఎస్సీనియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీనాయకుడు ఎం.ఎస్ రాజుకు బోర్డులో సభ్యత్వం లభించింది. ఇక, మరో ఎస్సీనాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత పనబాక లక్ష్మికి కూడా.. చంద్రబాబు టీటీడీ బోర్డులో సభ్యత్వం ఇవ్వడం గమనార్హం. అలాగే.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, కర్ణాటకకు చెందిన హంద్యాల లక్ష్మీనారాయణస్వామి దత్తు(హెచ్. ఎల్. దత్తు) కు కూడా.. చంద్రబాబు బోర్డులో అవకాశం కల్పించారు.
This post was last modified on October 30, 2024 10:00 pm
నితిన్-రష్మి-వెంకీ కుడుముల కలయికలో వచ్చిన ‘భీష్మ’ అప్పట్లో పెద్ద హిట్టే అయింది. మళ్లీ ఈ కలయికలో సినిమాను అనౌన్స్ చేసినపుడు…
తమిళ స్టార్ హీరో ధనుష్, లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకప్పుడు మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి ‘యారుడీ నీ…
తమిళ కథానాయిక త్రిషకు తెలుగులో పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా.. వర్షం. ఆ సినిమాతో ఒకేసారి ఆమె చాలా మెట్లు…
2019లోనే శాండల్ వుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ రుక్మిణి వసంత్ కు బ్రేక్ రావడానికి నాలుగేళ్లు పట్టింది. సప్తసాగరాలు దాటి సైడ్…
జనవరి 10 విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్లలో కీలకమైనది ప్రీ రిలీజ్ ఈవెంట్. దానికి సంబంధించి నిర్మాత దిల్…
టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ సిద్ధార్థ్, అదితి రావు హైదరీ కొన్నాళ్లు ప్రేమించుకున్న తర్వాత పెద్దల ఆశీర్వాదంతో ఈ ఏడాది సెప్టెంబర్…