అమెరికాలోని లాస్‍వేగాస్‍లో జరుగుతున్న “ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్”లో ఏపీ ఐటీ శాఖా మంత్రి మంత్రి నారా లోకేష్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయిన లోకేష్ ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) మేనేజింగ్ డైరక్టర్ రేచల్ స్కాఫ్, పెప్సికో మాజీ చైర్మన్, సీఈఓ ఇంద్రా సూయి, సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈఓ క్లారా షిహ్‌తో లోకేష్ భేటీ అయ్యారు.
ఏపీ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఈ గవర్నెన్స్, ఏఐ, ఐటీకి ఇస్తున్న ప్రాధాన్యత, ఏపీ పాలసీలు, పెట్టుబడులు పెట్టేందుకు అనువైన సదుపాయాల గురించి వివరించారు. లోకేష్ ఆహ్వానంపై వారు సానుకూలంగా స్పందించారు.
ఏపీలో పెట్టుబడులను ప్రోత్సహించడం, బ్రాండ్ ఏపీ రూపకల్పనకు మద్దతివ్వాలని ఇంద్రా సూయీని లోకేష్ కోరారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ముందుకుపోతున్నామని, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు ఏపీలో అమలుచేస్తున్నామని తెలిపారు.
మహిళా నాయకత్వాన్ని తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, కార్పొరేట్, ప్రభుత్వ రంగాల భాగస్వామ్యంతో మెరుగైన సమాజ నిర్మాణం కోసం వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. ఏపీలో సాంకేతిక పర్యావరణ వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలను పరిశీలించేందుకు ఏపీలో పర్యటించాలని కోరారు. లోకేష్ ప్రతిపాదనలపై ఇంద్రానూయి సానుకూలంగా స్పందించి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తమ వంతు సహకారమందిస్తానన్నారు.
సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈఓ క్లారా షిహ్ తో భేటీ అయిన లోకేష్ స్మార్ట్ గవర్నెన్స్, ఏఐ డ్రైవెన్ ఎకానమీపై ఏపీ ప్రభుత్వం దృష్టిసారించిందని చెప్పారు. రాష్ట్రంలో ఏఐ ఆధారిత పరిశ్రమల కోసం యువతకు స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇవ్వాలని, ఏపీ టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి ఏఐ టూల్స్, మెంటార్‌షిప్‌ను అందించాలని లోకేష్ విజ్నప్తి చేశారు.
సేల్స్‌ఫోర్స్ తాలూకు “ఐన్‌స్టీన్ ఏఐ”ని ఏపీకి పరిచయం చేయాలని కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై తమ సహచర బృందంతో చర్చిస్తామని క్లారా షిష్ వెల్లడించారు.
ఏపీలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాలని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) మేనేజింగ్ డైరక్టర్ రేచల్ స్కాఫ్ తో లోకేష్ అన్నారు. క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఏపీ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ లక్ష్యాల సాధనకు, ఏపీ స్మార్ట్ గవర్నెన్స్ లో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సేవలు అవసరమని అభిప్రాయపడ్డారు.
ఏపీని ఏఐ ఇన్నోవేషన్ హబ్ గా మార్చాలని, తమతో కలిసి పనిచేయాలని, ఏడబ్ల్యూఎస్ తదుపరి డేటా సెంటర్‌కు ఏపీ అనువైనదని చెప్పారు. లోకేష్ ప్రతిపాదనలపై స్పందించిన రేచల్ స్కాఫ్.. ఏపీలో క్లౌడ్ సేవలు అందించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
This post was last modified on October 30, 2024 3:59 pm
జనవరి 10 విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్లలో కీలకమైనది ప్రీ రిలీజ్ ఈవెంట్. దానికి సంబంధించి నిర్మాత దిల్…
టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ సిద్ధార్థ్, అదితి రావు హైదరీ కొన్నాళ్లు ప్రేమించుకున్న తర్వాత పెద్దల ఆశీర్వాదంతో ఈ ఏడాది సెప్టెంబర్…
"వాళ్లంతా జైలుకు వెళ్లాల్సిందే.. ఇది నా పంతం" అని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఫైర్బ్రాండ్ రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు కేంద్ర మంత్రులతో పవన్…
రాష్ట్రంలో కాంగ్రెస్ భవితవ్యం ఏంటి? మున్ముందు పార్టీ పుంజుకునే పరిస్థితి ఉంటుందా? ఇదీ.. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చర్చిస్తున్న…
ఇటీవలే చెన్నైలో జరిగిన పుష్ప 2 ది రూల్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో దేవిశ్రీ ప్రసాద్ ప్రసంగం ఎంత దుమారం…