వైఎస్ కుటుంబంలో రాజుకున్న ఆస్తుల వివాదం.. తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ వివాదం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు .. దేశవ్యాప్తంగా కూడా చర్చకు వచ్చింది. పది రోజుల పాటు ఈ ఎపిసోడ్ పత్రికల్లోనూ ప్రముఖంగా ముందుకు సాగింది. వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల మధ్య చోటు చేసుకున్న ఈ వివాదం అనేక మలుపులు తిరిగింది. ఈ క్రమంలో అందరి చూపూ విజయమ్మ వైపే పెట్టారు. ఆమె స్పందించాలని కోరుకున్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు విజయమ్మ స్పందించారు.
తాజాగా మంగళవారం సాయంత్రం ఆమె వైఎస్సార్ అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. వైఎస్ ఆశయాల మేరకు.. ఆస్తులను ఇద్దరికీ సమానంగా పంచాలన్నది వైఎస్ ఉద్దేశమని చెప్పారు. అయితే.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు.. తనను కలచివేస్తున్నాయని చెప్పారు. ఇద్దరి మధ్య(జగన్, షర్మిల) తాను ఎంతో ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. అయినా కూడా.. జరగకూడనివి జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక, ఈ ఎపిసోడ్‌లో కొందరు(విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి) జోక్యం చేసుకుని చెబుతున్నవన్నీ.. అబద్ధా లేనని చెప్పారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారని అన్నారు. ‘‘జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా బాధేస్తోంది. జరగకూడనివన్నీ నా కళ్ల ముందే జరిగిపోతున్నాయి“ అని విజయమ్మ పేర్కొన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారని తెలిపారు.
అయితే.. ఈ అబద్ధాల పరంపర ఇంక కొనసాగకూడదని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఇద్దరు పిల్లలకే కాకుండా.. రాష్ట్రానికి కూడా మంచిది కాదని పేర్కొన్నారు. అయితే.. షర్మిల.. వైఎస్ చెప్పినట్టు.. నలుగురు మనవలకు సమానంగా పంచాలని కోరుతుండగా.. విజయమ్మ మాత్రం ఇద్దరి గురించే పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం ఈ లేఖతో అయినా.. వివాదాలు ఆగుతాయేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates