రాష్ట్రాన్ని ఎలా ముందుకు నడిపించాలో తనకు బాగానే తెలుసునని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తాను ఫుట్ బాల్ ప్లేయర్‌నని.. తనకు ఎలా ఆడాలో తెలుసునని పరోక్షంగా తెలంగాణ రాజకీయాలపై ఆయన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకున్నాకే.. ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కినట్టు చెప్పారు. సీఎం కావాలన్నది తన కలగా పేర్కొన్నారు. దీనిని నెరవేర్చుకున్నానని తెలిపారు.
రాష్ట్రంలో అనేక పనులు చేపట్టామని.. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి రెంటినీ సమపాళ్లలో ముందుకు తీసుకువెళ్తున్నట్టు చెప్పారు. గతంలో ఉద్యోగులకు నెలలో ఎప్పుడు జీతాలు ఇచ్చేవారో కూడా తెలియని పరిస్థితి ఉండేదని, కానీ, తాము వచ్చాక.. ఉద్యోగులకు 1వ తేదీనే వేతనాలు ఇస్తున్నామన్నారు. అదేసమయంలో ఇచ్చిన గ్యారెంటీల హామీలను కూడా అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఎక్కడ తప్పులు జరిగినా.. అవి సీఎం వల్లే జరిగాయని అనడం బుద్ధిలేని వాళ్లు చేసే పనిగా విమర్శించారు.
మూసీ ప్రతిష్టాత్మకం..
మూసీ నదిని ప్రక్షాళన చేయడం అనేది.. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు సీఎం చెప్పారు. అనేక సమస్యలు వస్తాయని తెలిసి కూడా.. దీనిని ప్రారంభించామన్నారు. ఉత్తిపుణ్యాన ఎవరి భూమినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఏదీ చేయదని చెప్పారు. ఆక్రమించారు కాబట్టే తొలగిస్తున్నామన్నారు. హైడ్రా వస్తే.. రియల్ ఎస్టేట్ పడిపోతుందని చెప్పిన వారు.. ఇప్పుడు ఎక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయిందో చెప్పాలన్నారు. తాము వచ్చాక.. 2 లక్షల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ పుంజుకున్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
తాను ప్రపంచ మేధావినని చెప్పుకొనే కేటీఆర్‌కు.. మూసీ నదిపై అవగాహన ఉందా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఎందుకు దీనిని వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు. ఇంటర్నేషనల్ మైండ్ ఉన్న కేటీఆర్ సలహాలు సూచనలు చేస్తే.. మాఅధికారులు తీసుకుంటారని.. చెప్పారు. 55 కిలో మీటర్ల మేరకు మూసీ నది తిరిగి ప్రక్షాళన అయితే.. నగరానికి పేరు , ప్రభుత్వానికి ఆదాయం రెండూ వస్తాయని.. ఇది ఇష్టంలేని వారే విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
This post was last modified on October 30, 2024 6:59 am
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…
ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…
ముందో విడుదల తేదీ అనుకుని పోటీ వల్ల వెనుకడుగు వేసి ఇప్పుడు కొత్త డేట్ పట్టుకునేందుకు కిందా మీద పడుతున్న…
https://youtu.be/zHiKFSBO_JE?si=HDSpx4GNEhcOje0y కొత్త సంవత్సరం తొలి ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ జనవరి 10 విడుదల కాబోతున్న నేపథ్యంలో అందరి…