గత పది రోజులుగా షర్మిల వర్సెస్ వైసీపీ అన్నట్టుగా సాగిన రాజకీయాలు రాష్ట్రాన్ని హోరెత్తించాయి. నిరంతరం.. ఆమె చుట్టూ రాజకీయాలు నడిచాయి. దీనిలో వైసీపీని కొన్ని మీడియా సంస్థలు బూచిగా చూపిస్తే.. వైసీపీ అనుకూల వర్గాలు షర్మిలను తప్పుబట్టాయి. మొత్తంగా వైసీపీ రాజకీయాలు షర్మిల చుట్టూ తిరిగిన నేపథ్యం గత వారం మొత్తం సాగింది. అయితే.. ఇప్పుడు దీనికి బ్రేక్ ఇస్తూ.. జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
పార్టీ నాయకులకు ఆయన తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఇక, నుంచి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టం డి.. ప్రజల సమస్యలను ప్రశ్నించండి. వారి తరఫున కూటమి సర్కారును నిలదీయండి.. అని జగన్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. అంతేకాదు.. షర్మిల వ్యవహారంపై ఇక పార్టీ తరఫున ఎవరూ మా ట్లాడొద్దని కూడా తేల్చి చెప్పడం గమనార్హం. అంటే.. మొత్తంగా వైసీపీ తరఫున ఇక, నుంచి షర్మిల గురించి ఎవరూ మాట్లాడరన్నది స్ఫస్టమైంది.
దీనికి కారణం.. ఇటు వైపు నుంచి మౌనంగా ఉంటే.. షర్మిలకు అవకాశం తగ్గించేందుకు చాన్స్ ఉంటుంద ని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు షర్మిల ఒకటి మాట్లాడితే.. వైసీపీ నాయకులు రెండు మాట్లాడారు. దీంతో ప్రతి విషయానికీ షర్మిల వైపు నుంచి కౌంటర్ పడుతోంది. ఇది వైసీపీకి మేలు చేయకపోగా.. ఇబ్బందులు తెస్తోంది. షర్మిల చేస్తున్న వ్యాఖ్యలకు తామే ఆజ్యం పోస్తున్నామా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఒకరకంగా ఆమెవిషయంలో మౌనంగా ఉంటే.. ఇక, మాట్లాడి మాట్లాడి.. ఆమే సైలెంట్ అయిపోతారన్నది వైసీపీ భావనగా ఉంది. ఈ నేపథ్యంలోనే కీలక నాయకులు సహా క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికీ తాజాగా జగన్.. ఈ మేరకు ఆదేశాలు పంపించారు. ఇక, నుంచి పార్టీ ప్రజల కోసం పనిచేయాలన్నది ఆయన సూచన. తద్వారా.. ప్రజా సమస్యల నుంచి వైసీపీ దృష్టి మరిలిపోయిందన్న భావనను తుడిచి వేయాలన్న సంకేతాలు కూడా ఇచ్చినట్టు అయింది. దీంతో షర్మిల ఇక నుంచి ఏం మాట్లాడినా.. ఎవరూ స్పందించరన్నది స్పస్టమైంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates