వైసీపీ అధినేత జగన్‌పై ఆయన సొంత బావమరిది, షర్మిల భర్త బ్రదర్ అనిల్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయాల కోసం.. జగన్ ఎంతటి స్వార్థానికైనా దిగజారే వ్యక్తి అని ఆయన చెప్పారు. ఓ ప్రముఖ యూట్యూబర్ నిర్వహించిన ఇంటర్వ్యూలో అనిల్ అనేక విషయాలు చెప్పుకొచ్చారు. అనిల్ ప్రముఖ సువార్తీకుడు అనే విషయం తెలిసిందే. అయితే.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. క్రైస్తవుల్లో తన ఇమేజ్‌ను తగ్గించేందుకు ప్రయత్నించారని అనిల్ చెప్పారు.
2019 ఎన్నికలకు ముందు.. సువార్త కూటములు పెడితే.. నాగురించి చెప్పావా? పార్టీ తరఫున చెప్పావా? అని జగన్ ప్రశ్నించినట్టు అనిల్ చెప్పారు. కానీ, అధికారంలోకి వచ్చాక.. తమను పక్కన పెట్టేశారని అన్నారు. ఆస్తుల్లో వాటా ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే ఇలా చేశారని తాము భావిస్తున్నట్టు అనిల్ వివరించారు. “పాస్టర్ వృత్తిని కూడా మానేయాలని జగన్ ఒత్తిడి తెచ్చారు. అసలు నా కెరీర్ మత ప్రచారం. దాన్ని కూడా ఆపేయాలని చెప్పడం ఏమిటో నాకు అర్థం కాలేదు” అని వ్యాఖ్యానించారు.
అప్పట్లో జగన్ బీజేపీతో జట్టు కట్టి ఉన్నారని.. ఆ పార్టీకి ఎక్కడ కోపం వస్తుందన్న ఉద్దేశంతోనే ఇలా చెప్పి ఉంటారని తాను భావిస్తున్నట్టు అనిల్ వ్యాఖ్యానించారు. అదేసమయంలో కేసీఆర్ అంటే జగన్ భయపడేవారని అనిల్ చెప్పడం సంచలనంగా మారింది. వాస్తవానికి కేసీఆర్‌కు జగన్‌కు మధ్య మిత్రత్వం ఉన్న విషయం తెలిసిందే. కానీ, అనిల్ మాత్రం కేసీఆర్ అంటే జగన్ భయపడేవారని చెప్పుకొచ్చారు. దీనికి కారణం.. తన ప్రధాన వ్యాపారాలు, ఆస్తులు కూడా హైదరాబాద్‌లో ఉన్నాయని తెలిపారు.
నేను మాట్లాడితే..
ప్రస్తుతం జరుగుతున్న ఆస్తుల వివాదంలో తాను జోక్యం చేసుకునేది లేదని.. అనిల్ చెప్పారు. ఈ విషయంలో అన్నా చెల్లెళ్లు చూసుకుంటారని.. షర్మిలకు ఆ సత్తా ఉందని తెలిపారు. తాను జోక్యం చేసుకుని షర్మిలను ఇబ్బంది పెట్టేదిలేదన్నారు. అయినా.. తాను మాట్లాడాల్సింది ఏమీ లేదన్నారు. అంతా షర్మిల చెప్పాక.. తాను చెప్పేది ఏముంటుంది? అని ప్రశ్నించారు.
This post was last modified on October 29, 2024 3:23 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…