వైసీపీ అధినేత జగన్, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య తారస్థాయిలో చోటు చేసుకున్న ఆస్తుల వివాదాన్ని కూటమి పార్టీలు చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాయి. గత 10 రోజులుగా ఈ ఆస్తుల వివాదం మీడియాలో పెద్ద ఎత్తున హైలెట్ అవుతోంది.
ఇది తమకు రాజకీయంగా మేలు చేస్తుందని టీడీపీ నాయకులు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. అన్న మోసంపై ప్రజలు కూడా చర్చించుకుంటున్నారని అంటున్నారు.
ఇక, ప్రజలలోకి షర్మిలకు జరిగిన అన్యాయాన్ని రాజకోణంలో ప్రచారం చేసేందుకు కూడా కూటమి పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. చెల్లికే న్యాయం చేయలేని వాడు.. రాష్ట్రంలో మహిళలకు న్యాయం ఏం చేస్తాడంటూ.. ఇప్పటికే మంత్రి అనిత, నిమ్మల రామానాయుడు వంటివారు ఆక్షేపించారు.
ఈ విషయం లో తమకు సంబంధం ఏంటని సీఎం చంద్రబాబు ప్రకటించినా.. అవకాశం వస్తే మాత్రం వదిలి పెట్టు కుండా ఆడేసుకునేందుకు కూటమి ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు.
ఇక, మరోవైపు.. సర్కారు పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఈ వివాదాల కారణంగా హైలెట్ కాకపోవడం మరో కలిసి వస్తున్న విషయం. వాస్తవానికి ఈ వివాదం లేకపోయి ఉంటే.. కేంద్రం నుంచి రావాల్సిన వరదసాయంపై ఉద్యమించేందుకు వైసీపీ సన్నద్ధమైంది.
కానీ, ఈ వివాదంతో అది మరుగున పడింది. ఇది కూటమికి మేలు చేసినట్టేకదా! ఇక, ఇసుక, మద్యంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నా యని.. వాటిపైనా ఉద్యమించేందుకు వైసీపీ ప్లాన్ చేసింది. కానీ, ఈ ఆస్తుల వివాదంతో అది కూడా కనుమరుగైంది.
మరీ ముఖ్యంగా గత వారంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మహిళలపై జరిగిన దారుణాలను పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకురావాలని వైసీపీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన నిరసనలు, ధర్నాలకు జగన్ పిలుపు ఇవ్వాలని కూడా అనుకున్నారు.
కానీ, ఇంతలోనే షర్మిల పేల్చిన ఆస్తుల బాంబు సెగల నుంచి వైసీపీ కోలుకోలేదు. దీంతో ఈ పరిణామాలు కూడా నిలిచిపోయాయి. మొత్తంగా చూస్తే..అ టు రాజకీయంగా ఇటు పాలన పరంగాకూడా.. అన్నా చెల్లెళ్ల ఆస్తుల వివాదం కూటమికి కలిసి వస్తోందని చెబుతున్నారు.
This post was last modified on October 28, 2024 5:41 am
ఐకాన్ స్టార్ అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్…
బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్…
2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…
దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…
ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…
ఆస్కార్ అవార్డుల్లో ఆధిపత్యం చలాయించే అన్ని సినిమాలకూ వసూళ్లు వస్తాయని గ్యారెంటీ లేదు. అలాగే వసూళ్ల మోత మోగించిన చిత్రాలకూ…