కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిలపై వైసీపీ నాయకులు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అన్నట్టుగా ఆదివారం ఉదయం నుంచి విరుచుకుపడ్డారు. ఉదయాన్నే.. విశాఖలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేయగా.. అనంతరం.. హైదరాబాద్‌లో వైసీపీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మోచేతి నీళ్లు షర్మిలే తాగుతోందని చెప్పుకొచ్చారు.
ఇక, తిరుపతి లో మీడియా ముందుకు వచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి కూడా.. షర్మిల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా శనివారం నాటి షర్మిల మీడియా మీటింగ్ తర్వాత.. వైసీపీ అంతర్మథనంలో పడినట్టు కనిపిస్తోంది. నిజానికి ఇప్పటి వరకు ఈ రేంజ్‌లో షర్మిలను ఎవరూ టార్గెట్ చేయలేదు. గతంలో కూడా షర్మి లకు.. వైసీపీకి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నా.. ఇప్పుడు ఫస్ట్ టైమ్ ఇంత మంది మాటల దాడితో షర్మిలపై విరుచుకుపడ్డారు.
ఈ పరిణామాలను నిశితంగా చూస్తే.. వైసీపీ ఆత్మరక్షణలో పడిందన్న భావన వ్యక్తమవుతోంది. అందుకే పార్టీ అధినేత ఆదేశాలతో నేతలు క్షేత్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ, ఎవరు ఎన్ని చెప్పినా.. షర్మిల చేస్తున్న వాదనను మాత్రం తోసిపుచ్చలేక పోతున్నారు. ఆమె తమ తండ్రి వైఎస్ చెప్పినట్టు నలుగురు మనవళ్లకు సమానంగా ఆస్తులు పంచారా? లేదా? జగన్ ఏం చేశారు? అనేది మాత్రం ఎవరి నోటి నుంచి బయటకు రాకపోవడం గమనార్హం.
అయితే.. రాజకీయంగా మాత్రం షర్మిలను టార్గెట్ చేయడం గమనార్హం. ఇక, గతంలో సోషల్ మీడియాలో నూ షర్మిలను ట్రోల్ చేశారు. కానీ, ఇప్పుడు మాత్రం కూటమి సర్కారు సోషల్ మీడియాపై అప్రమత్తంగా ఉండడంతో ఎవరూ సోషల్ మీడియావైపు వెళ్లకపోవడం గమనార్హం. కానీ.. ఇలా షర్మిలపై మూకదాడి చేయడం చూస్తే.. కాంగ్రెస్ నాయకులు స్పందించాలి కదా! అనే చర్చ వస్తుంది. కానీ, వారు ఇంకా స్పందించడం లేదు.
This post was last modified on October 27, 2024 5:42 pm
ఐకాన్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన ఘట్టం జరిగిపోయింది. నిన్నటిదాకా పక్క రాష్ట్రాల్లో జరిగిన పుష్ప 2 ప్రమోషన్లను…
పుష్ప 2 ది రూల్ కు సంబంధించి ఎన్ని ఈవెంట్లు చేసినా పని ఒత్తిడి వల్ల ఇప్పటిదాకా బయటికి కనిపించనిది…
హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన పుష్ప 2 ది రూల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాస్…
కన్నడ మూవీ కిస్ తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. దర్శకేంద్రుడు తెరకెక్కించిన పెళ్లి సందడి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో…
తెలంగాణలో టికెట్ ధరల పెంపు, జీవోలు వచ్చేసి ఆన్ లైన్ అమ్మకాలు మొదలయ్యాక కూడా ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఆలస్యం…
కిక్కిరిసిపోయిన అభిమాన జనసందోహం మధ్య పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో ఘనంగా…