Political News

నాపై ట్రోల్ చేస్తే.. బ‌ట్ట‌లూడ‌దీసి కొడ‌తా!: భ‌గ్గుమ‌న్న జ‌గ్గారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి స‌హ‌నం కోల్పోయారు. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే కామెంట్ల‌పై ఆయ‌న నోరు చేసుకున్నారు. త‌న‌పై ట్రోల్స్ చేసేవారిని బ‌ట్ట‌లూడ‌దీసి కొడ‌తానంటూ రెచ్చిపోయారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? అనేది ఆస‌క్తిగా మారింది. ఇటీవ‌ల జ‌గ్గారెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై కొంద‌రు.. సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేశారు. దీనికి తోడు సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్య‌లు, హైడ్రా ప‌నితీరుపైనా సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్లు ప‌డుతున్నాయి. అయితే.. ఇది నేటి నెట్ ప్ర‌పంచంలో కామ‌న్‌. కానీ, జ‌గ్గారెడ్డి మాత్రం ఫైరైపోయారు.

బీఆర్ ఎస్ పార్టీ దండుపాళ్యంగా మారి.. ఈ కామెంట్లు చేస్తోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. త‌న‌పై ట్రోలింగ్ చేసిన వారిని వ‌దిలి పెట్టేది లేద‌ని చెప్పుకొచ్చారు. వారికి లీగ‌ల్‌గా నోటీసులు ఇవ్వ‌డంతోపాటు.. దొరికితే బ‌ట్ట‌లు ఊడ‌దీసి బాదేస్తాన‌ని హెచ్చ‌రించారు. “ఎందుక‌య్యా మీరు చేసేది? మ‌మ్మ‌ల్ని అనేముందట‌.. మీ నాయ‌కుల తీరుఎలా ఉందో చూసుకోండి” అని నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిపైనా కొంద‌రు ట్రోల్ చేస్తున్నార‌ని. ఇది స‌రికాద‌న్నారు. ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న వ్య‌క్తిప‌ట్ల గౌర‌వ భావం ఉండాల‌ని సూచించారు.

కానీ, బీఆర్ ఎస్ దండుపాళ్యం బ్యాచ్‌.. ముఖ్య‌మంత్రి స‌హా మంత్రుల‌పైనా నోటికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు సోష‌ల్ మీడియాలో బూతులు తిడుతున్నార‌ని చెప్పారు. అవాకులు, చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “కొంత మంది ఉన్నారు. మేం ఏం మాట్లాడినా.. ఎడిట్ చేసి అతికిస్తున్నారు. ఇది స‌రికాదు. మంచి ప‌ద్ద‌తికాదు. ఇక‌నైనా మారండి” అని వ్యాఖ్యానించారు. తాను అన‌ని మాట‌ల‌ను కూడా అన్న‌ట్టుగా పోస్టులు పెడుతున్నార‌ని చెప్పారు. ప్ర‌జాస్వామ్యంలో విమ‌ర్శ‌లు కామ‌నేన‌ని.. కానీ, వ్య‌క్తిగ‌తంగా ఎందుకు దూషిస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. మార‌క‌పోతే.. మారేలా చేస్తామ‌ని జ‌గ్గారెడ్డి హెచ్చ‌రించారు.

This post was last modified on October 27, 2024 4:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

1 hour ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

1 hour ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

1 hour ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

3 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

4 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

5 hours ago