వైసీపీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చారు. గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా కూడా .. తీవ్ర చర్చనీయాంశంగా మారిన షర్మిల-జగన్ ఆస్తుల విషయంపై మీడియా సమావేశం పెట్టారు. దీనికి 20 గంటల ముందే.. ఆయన పీఏ.. పెద్ద ఎత్తున మీడియా వర్గాల్లో ప్రచారం కూడా చేశారు. ఇక, శనివారం షర్మిల మీడియా ముందుకు వచ్చి.. కన్నీరు పెట్టుకున్న తర్వాత వెంటనే సాయిరెడ్డి ప్రెస్ మీట్ ఉంటుందన్న వార్త హైప్ పెంచేసింది.
ఏం మాట్లాడతారో.. సాయిరెడ్డి ఏం చెబుతారో.. ఎలాంటి బాంబు పేలుస్తారో.. అని ఎక్కువ మంది టైం చూసుకుని మరీ ఈ ప్రెస్ మీట్ కోసం ఎదురు చూశారు. ఎందుకంటే.. రాజారెడ్డి హయాం నుంచి సాయిరెడ్డికి వైఎస్ కుటుంబంతో అత్యంత సాన్నిహిత్యం ఉంది. ఆడిటర్‌గా ఆయన వృత్తి జీవితాన్ని ప్రారంభిం చిన తర్వాత.. రాజారెడ్డి కుటుంబంతోనే ఆయన అనుబంధం పెంచుకుని.. వారి వ్యాపారాలు వ్యవహారా లు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో సాయిరెడ్డి.. ప్రస్తుత ఆస్తుల వివాదంలో ఎలా రియాక్ట్ అవుతారనే విషయం అందరికీ ఉత్కంఠగామారింది. కానీ, సాయిరెడ్డి మాత్రం ఈ అంచనాలను చేరుకోకపోగా.. పాత సంగతులు తవ్వారు. షర్మిలను కార్నర్ చేసుకుని.. ఆయన రాజకీయంగా విమర్శలు గుప్పించారు. వైఎస్ ఆస్తుల విభజన ఎప్పుడో అయిపోయిందని.. జగన్ తన చెల్లిపై ఉన్న ప్రగాఢ ప్రమేతోనే ఆస్తులు ఇప్పుడు వాటా ఇవ్వాలని అనుకుంటున్నారని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు.
మొత్తంగా చూస్తే.. సాయిరెడ్డి ప్రెస్ మీట్‌లో పసలేదన్నది స్పష్టంగా కనిపించింది. ఏదో జగన్ కోసం.. జగన్ చేత.. అన్నట్టుగా ఆయన మీడియా ముందు కూడా రచ్చ చేశారన్న భావన అయితే కనిపించింది ఎప్పుడో 2009లో దుర్మరణం చెందిన వైఎస్ మృతి ఘటనకు టీడీపీ నాయకులకు లింకులు పెట్టారు. అంతేకాదు.. కాంగ్రెస్‌తోనూ లింకులు కలిపారు. అసలు జగన్ ఎందుకు ఆస్తుల విషయంలో ఇంత మంకు పట్టుపడుతున్నారన్న విషయాన్ని మాత్రం ఆయన కప్పిపుచ్చి.. మీడియా మీటింగును మమ అనిపించారు.
This post was last modified on October 27, 2024 4:04 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…