వైసీపీలో ఒక్కొక్క నేతది కాదు.. గుంపులుగానే అందరిదీ ఒక్కటే బాధ! నిజంగానే అందరి నోటా ఇదే మాట వినిపిస్తోంది. జగన్ ఒంటెత్తు పోకడలను కొందరు నాయకులు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నా రు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నుంచి బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ వరకు.. అన్నింటిపై ఆయన ఫొటోలు వేసుకోవడాన్ని అనేక మంది నాయకులు తిరస్కరించారు. ఈ విషయం అధికారం కోల్పోయాక చెప్పుకొచ్చారు. ఇది పాలన పరంగా జరిగిన వ్యవహారం.
ఇక, ఇప్పుడు జిల్లాలకు ఇంచార్జ్‌లను నియమించారు. అయితే.. ఎంతో మంది సీనియర్‌లు, పార్టీ కోసం పనిచేసిన వారు ఉన్నా.. వారిని వదిలేసి.. కొందరికి మాత్రమే ఈ పదవులు కట్టబెట్టడంపై నాయకులు రగిలిపోతున్నారు. ఒక్క క్షణం కూడా.. వైసీపీలో ఉండలేని పరిస్థితి ఏర్పడిందని కొందరు చెబుతున్నారు. కానీ, వారు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీనికి కారణం.. వచ్చినా.. వారిని చేర్చుకునే పార్టీలు లేవు. సరైన వేదికలు కూడా కనిపించడం లేదు.
కాటసాని రాంభూపాల్ రెడ్డి. జగన్‌పై నిప్పులు చెరుగుతున్న కర్నూలు నాయకుడు. గడికోట శ్రీకాంత్ రెడ్డి.. వైసీపీని తక్షణం వదిలేయాలని నిర్ణయించుకున్న నాయకుడు. గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వెంటనే బయటకు వచ్చేయాలని కాచుకుని కూర్చున్న నాయకుడు. మాజీ హోం మంత్రి తానేటి వనిత.. ఎవరైనా పిలుపు ఇస్తే చాలు కండువా మార్చేయాలన్న ఆసక్తిగా ఉన్న నాయకురాలు. పుష్ప శ్రీవాణి.. ఏ చిన్న ఛాన్స్ చిక్కినా.. జగనన్నకు బై చెప్పాలని చూస్తున్న మాజీ మంత్రి.
వీరు మచ్చుకు కొందరు మాత్రమే. ఒకింత లోపలికి వెళ్లి లోతుగా చూస్తే.. ఈ జాబితా భారీగానే ఉంటుంద ని తెలుస్తోంది. కానీ, వీరికి అవకాశం లేదు. గతంలో వీరు వ్యవహరించిన తీరులేదా.. ప్రజల్లో పోయిన పరపతి.. రాజకీయంగా చేసుకున్న కొన్ని తప్పుల కారణంగా కూటమి పార్టీలు ఏవీ కూడా.. వీరిని దరి చేరనివ్వడం లేదు. ఈ నేపథ్యంలో విధిలేక.. వైసీపీలో కొనసాగుతున్నారు. అందుకే.. ఎంత భూకంపం వచ్చినా మాట్లాడడంలేదు. ఎంత తుఫాను చెలరేగినా.. నోరు విప్పడం లేదు. అందుకే.. నాయకులు అన్నవారు.. చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. లేకపోతే.. ఇదే పరిస్తితి!!
This post was last modified on October 27, 2024 9:05 am
పుష్ప 2 ది రూల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాధ్యతని తనకు కాకుండా వేరొకరికి ఇవ్వడం పట్ల దేవిశ్రీ ప్రసాద్…
దేశం మొత్తం ఎదురు చూసేలా చేసే సినిమాలు కొన్నే వస్తాయి. అందులో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘బాహుబలి-2’, ‘కేజీఎఫ్-2’…
నితిన్-రష్మి-వెంకీ కుడుముల కలయికలో వచ్చిన ‘భీష్మ’ అప్పట్లో పెద్ద హిట్టే అయింది. మళ్లీ ఈ కలయికలో సినిమాను అనౌన్స్ చేసినపుడు…
తమిళ స్టార్ హీరో ధనుష్, లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకప్పుడు మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి ‘యారుడీ నీ…
తమిళ కథానాయిక త్రిషకు తెలుగులో పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా.. వర్షం. ఆ సినిమాతో ఒకేసారి ఆమె చాలా మెట్లు…
2019లోనే శాండల్ వుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ రుక్మిణి వసంత్ కు బ్రేక్ రావడానికి నాలుగేళ్లు పట్టింది. సప్తసాగరాలు దాటి సైడ్…