టీడీపీ జాతీయ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా తమ్ముళ్లకు సరికొత్త టార్గెట్ విధించారు. ఒక్కొక్కరికీ వెయ్యి చొప్పున సభ్యత్వాల నమోదు బాధ్యతలను ఆయన అప్పగించారు. గతంలో ఈ బాధ్యత 100-200 మధ్య మాత్రమే ఉండగా.. ఇప్పుడు దానిని ఏకంగా ఐదు రెట్లు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కనీసంలో కనీసం 20 లక్షల మందికి సభ్యత్వం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు.
తాజాగా టీడీపీసభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. దీనికి ముందే ఆయన పార్టీ నాయకులకు వెయ్యి చొప్పున సభ్యత్వాలు నమోదు చేయించాలన్న టార్గెట్ విధించారు. దీనికి గాను నెల రోజుల సమయం కేటాయించారు. దీనికి తోడు ఆన్‌లైన్ సభ్యత్వ నమోదు ప్రక్రియ వేరేగా ఉంటుందని పేర్కొన్నారు. మొత్తంగా రాష్ట్రంలో 30 వేల మంది ముఖ్య నాయకులు ఉన్నారు. వీరంతా ఒక్కొక్కరు వెయ్యి చొప్పున సభ్యత్వాలు నమోదు చేయించాలన్నది టార్గెట్.
ఎందుకీ టార్గెట్..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. టీడీపీ అధినేత చంద్రబాబు గ్రాఫ్ విజృంభించింది. అమరావతి పరుగులు, ప్రాజెక్టుల నిర్మాణాలు, రహదారుల అభివృద్ది వంటివాటిని ఎక్కువగా ప్రాధాన్యం కల్పిస్తున్నారు. దీనికితోడు ఉపాధి కల్పన, ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు ముఖ చిత్రం మారనుందన్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. ఇక, ఇప్పటి వరకు ఈ వంద, 130 రోజుల్లో ప్రభుత్వం చేసిన పాలన ను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు.
ఫలితంగా.. టీడీపీపై సానుకూల దృక్ఫథం ఏర్పడిందన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. మరోవైపు వైసీపీ నుంచి వలసలు పెరుగుతుండడం.. ఆ పార్టీపై సానుభూతి సన్నగిల్లుతున్న నేపథ్యంలో టీడీపీపుంజుకునేందుకు ఇదే సరైన సమయంగా కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరికీ వెయ్యి మందిని చేర్చించే బాధ్యతను అప్పగించారు. ఈ టార్గెట్‌ను నెల రోజుల్లో పూర్తి చేసిన వారికి కీలక పదవులు దక్కుతాయన్నది పార్టీలో జరుగుతున్న చర్చ. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on October 26, 2024 8:57 pm
"వాళ్లంతా జైలుకు వెళ్లాల్సిందే.. ఇది నా పంతం" అని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఫైర్బ్రాండ్ రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు కేంద్ర మంత్రులతో పవన్…
రాష్ట్రంలో కాంగ్రెస్ భవితవ్యం ఏంటి? మున్ముందు పార్టీ పుంజుకునే పరిస్థితి ఉంటుందా? ఇదీ.. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చర్చిస్తున్న…
ఇటీవలే చెన్నైలో జరిగిన పుష్ప 2 ది రూల్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో దేవిశ్రీ ప్రసాద్ ప్రసంగం ఎంత దుమారం…
ఇద్దరు మహిళా నాయకులు పదవుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే టికెట్లు దక్కక ఉసూరు మంటున్న వీరు.. ఇప్పుడు నామినేటెడ్…
ఊహలు గుసగుసలదే మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి రాశిఖన్నా. ఈ టాలీవుడ్ బ్యూటీ…