ఏపీ మాజీ సీఎం జగన్, ఏపీ పీసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలల మధ్య ఆస్తి పంపకాల వ్యవహారం తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ప్రతి ఇంట్లో చిన్న చిన్న వివాదాలు ఉంటాయని, వాటిని రాజకీయం చేయడం సరికాదని ఏపీ మాజీ సీఎం జగన్ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. తన సోదరి షర్మిల తనకు రాజకీయంగా వ్యతిరేకంగా వెళ్తున్న నేపథ్యంలోనే ఆస్తుల విషయంలో తేడా వచ్చిందని జగన్ చెప్పిన వైనం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే జగన్ వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు.
సామాన్యం అంటూనే తల్లిని, చెల్లిని కోర్టుకు ఈడ్చారని, ఇది సామాన్యమైన విషయం కాదు జగన్ సార్ అంటూ షర్మిల తన సోదరుడు జగన్ కి ఇచ్చిన కౌంటర్ వైరల్ గా మారింది. తమ కుటుంబంలో ఆస్తుల వివాదం నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలని అనుకున్నామని, సామరస్యంగానే దానిని సెటిల్ చేసుకోవాలనుకున్నామని షర్మిల చెప్పారు. కానీ, సామాన్యం అంటూనే అన్ని కుటుంబాల్లో జరిగేది అంటూనే తల్లిని చెల్లిని కోర్టుకు ఈడ్చారని, ఇది సామాన్య విషయం కాదని షర్మిల అన్నారు.
ఆస్తుల అటాచ్ మెంట్ అని, ఈడీ కేసులు, బెయిల్ అని జగన్ చెబుతున్నారని, కానీ సరస్వతి కంపెనీ షేర్లను ఈడీ అటాచ్ చేయలేదని షర్మిల చెప్పారు. ఈ క్రమంలోనే జగన్ కు షర్మిల కొన్ని ప్రశ్నలు సంధించారు. 32 కోట్ల విలువైన కంపెనీ భూమిని ఈడీ అటాచ్ చేసిందని, కానీ, సరస్వతి కంపెనీ భూములను ఈడీ ఏనాడు అటాచ్ చేయలేదని షర్మిల క్లారిటీనిచ్చారు. ఏ సమయంలో అయినా షేర్లను బదిలీ చేసుకునే అవకాశం ఉందని, 2016లో ఈ ఆస్తులు అటాచ్ చేసినందువలన షేర్లు బదిలీ జరగకూడదని జగన్ వాదిస్తున్నారని, అది సరికాదని చెప్పుకొచ్చారు.
అలా అయితే, 2019లో 100% వాటాలు బదలాయిస్తామని ఎంవోయుపై జగన్ సంతకం ఎలా చేశారని షర్మిల ప్రశ్నించారు. ఆనాడు బెయిల్ సంగతి గుర్తుకు రాలేదా అని జగన్ కు షర్మిల సూటి ప్రశ్న సంధించారు. మరి, షర్మిల ప్రశ్నలకు జగన్ సమాధానం ఏ విధంగా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on October 24, 2024 9:38 pm
షూటింగ్ అయిపోయింది ఇంకే టెన్షన్ లేదని హరిహర వీరమల్లు వెంటనే రిలాక్స్ అవ్వడానికి లేదు. ఎందుకంటే అసలైన సవాల్ విడుదల…
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధిపతి, మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డి సహా మరికొందరికి తాజాగా నాంపల్లిలోని సీబీఐకోర్టు 7 ఏళ్ల…
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 28 మంది అమాయకులు అశువులు బాసిన సంగతి తెలిసిందే.…
హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగాక.. ఏదో ఒక దశలో డౌన్ కావాల్సిందే. హీరోల మాదిరి దశాబ్దాల తరబడి కెరీర్లో పీక్స్లో…
టాలీవుడ్ అగ్ర నటుడు, టీడీపీ సీనియర్ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండో అమెరికన్ బసవతారకం…
పెహల్గామ్ దుర్ఘటన తర్వాత ఇండియా, పాకిస్థాన్ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో ఊహించడం కష్టంగా ఉంది.…