Political News

ఆ ఒక్క‌టి త‌ప్ప‌.. ఏపీ పై కేంద్రం వ‌రాల జ‌ల్లు!

ఏదో సినిమాలో ఆ ఒక్క‌టి అడ‌క్కు! అన్న‌ట్టుగా ఏపీకి కీల‌క‌మైన విశాఖ రైల్వే జోన్ మిన‌హా.. మిగిలిన వాటి విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా వ‌రాల జ‌ల్లు కురిపించింది. రైల్వే నుంచి రోడ్డు వ‌ర‌కు.. ప‌లు కీల‌క ప్రాజెక్టుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. తాజాగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ నిర్వ‌హించి వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ప‌లు ప్రాజెక్టుల‌కు నిధులు ఇవ్వ‌డంతోపాటు.. వాటికి మాస్ట‌ర్ ప్లాన్ కూడా మంజూరు చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా పాల్గొన్నారు.

ఇవీ విశేషాలు..

  • విశాఖ రైల్వే జోన్ వ్య‌వ‌హారంపై చంద్ర‌బాబు సూటిగా ప్ర‌శ్నించారు. ఈ జోన్ వ్య‌వ‌హారం.. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యం నుంచి పెండింగులో ఉంద‌న్నారు. దీనిని పూర్తి చేయాల‌ని చాలా సార్లు కోరామ‌ని కూడా.. చెప్పారు. విశాఖ రైల్వే జోన్ ఇస్తే.. కావాల్సిన స‌దుపాయాలు, భూములు కూడా ఇస్తామ‌న్నారు. అయితే.. ఈ విష‌యం ప‌రిశీల‌న‌లో ఉందంటూ.. అశ్వినీ వైష్ణ‌వ్ దాట వేశారు.
  • అనంత‌పురం జిల్లా ప‌రిటాల‌ను మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్రం సంసిద్ధ‌త వ్య‌క్తం చేసింది. ఇక్క‌డ కార్గో టెర్మిన‌ల్ ఏర్పాటు కానుంది. దీనివ‌ల్ల 2 నుంచి 5 వేల మందికి ఉపాధి క‌ల‌గ‌నుంది.
  • ఏపీలో 73 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. త‌ద్వారా స్థానిక ప్రాంతాల అభివృద్ది, చిరు వ్యాపారుల‌కు ప్రోత్సాహం ల‌భించ‌నుంది. అదేవిధంగా ఉపాధిక‌ల్ప‌న‌కు కూడా ఈ రైల్వే స్టేష‌న్లు దోహ‌ద ప‌డ‌నున్నాయి.
  • ఏపీలో 160 కిలో మీట‌ర్ల వేగంతో సెమీ హైస్పీడ్ రైళ్లు న‌డిచేలా మూడు లైన్ల‌ను అభివృద్ది చేస్తున్నారు. ఇవి.. అమ‌రావ‌తి-హైద‌రాబాద్‌, అమ‌రావ‌తి-చెన్నై, అమ‌రావ‌తి-బెంగ‌ళూరు.
  • పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజా రవాణాకు మెరుగైన వ్యవస్థ ఉండేలా మ‌ల్టీ ట్రాకింగ్ వ్య‌వ‌స్థ‌ను కూడా ఏర్పాటు చేయ‌నున్నారు.
  • శ్రీకాకుళం జిల్లాలోని ప్ర‌ధాన ప్రాంత‌మైన ర‌ణ‌స్థ‌లం వ‌ద్ద జాతీయ ర‌హ‌దారి ఏర్పాటుకు కూడా కేంద్రం ఓకే చెపింది. దీనికి సుమారు 250 కోట్ల రూపాయ‌ల‌ను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 6 లైన్ల ర‌హ‌దారి ఏర్పాటు చేయ‌నున్నారు. ఫ‌లితంగా ప‌ట్ట‌ణ ప్ర‌జా ర‌వాణా మ‌రింత సుల‌భ‌త‌రం కానుంది.

This post was last modified on October 24, 2024 9:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అప్పట్లో శ్రీలీల డేట్స్ అంటే పెద్ద ఛాలెంజ్, కానీ ఇప్పుడు…

బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్…

19 mins ago

బోల్డ్ ఫోటోషూట్ తో కట్టి పడేస్తున్న మిల్కీ బ్యూటీ!

2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…

39 mins ago

ఆర్సీబీకి ‘హిందీ’ సెగ.. తెలుగు లేదా?

దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…

52 mins ago

నా రికార్డింగ్స్ వాడుకుంటే నీకైనా నోటీసులే : వెట్రి మారన్ తో ఇళయరాజా!

ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…

1 hour ago

మెగా బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్!

ఆస్కార్ అవార్డుల్లో ఆధిపత్యం చలాయించే అన్ని సినిమాలకూ వసూళ్లు వస్తాయని గ్యారెంటీ లేదు. అలాగే వసూళ్ల మోత మోగించిన చిత్రాలకూ…

2 hours ago

ఏపీలో డ్రగ్స్ పై ‘ఈగల్’ ఐ

వైసీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అమ్మకం, వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయాయని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ఏ…

2 hours ago