చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది వైసీపీ అధినేత జగన్ పరిస్థితి. ఆయన హయాంలో జరిగి న తప్పులపై అప్పట్లో కూటమి పార్టీలు ఊరూవాడా ప్రచారం చేశాయి. ఆధారాలు చూపలేదు కానీ.. ప్రచా రంలో మాత్రం దూసుకుపోయాయి.
ఇక, ఎలానూ కూటమి పార్టీలకు మౌత్ పీస్‌లు ఉన్నాయి కాబట్టి ఆ ప్రచారం జోరుగా.. హోరెత్తింది. అలాంటి సమయంలోనే స్పందించి.. తాను చేసిందేంటో చెప్పుకోవాల్సి న జగన్ మౌనంగా ఉండిపోయారు. అయితే..ఇ ప్పుడు ఆయనకు తత్వం బోధపడినట్టుంది!
అందుకే, తాజగా జగన్.. తన హయంలో జరిగిన వాటిని రోజుకొక సీరియల్‌గా వివరిస్తున్నారు. కానీ, ఇప్పు డు ఎవరు మాత్రం విశ్వసిస్తారనేది ప్రశ్న. ముద్దొచ్చినప్పుడే అన్నట్టుగా.. అధికారంలో ఉన్నప్పుడే వివ రించి ఉంటే.. బాగుండేదని సొంత పార్టీ నాయకులే అంటున్నారు.
ఇంతకీ విషయం ఏంటంటే.. వరుసగా గత మూడు రోజులుగా వైసీపీ నాయకులతో జగన్ భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా కూటమి తప్పులు అంటూ.. కొన్ని లెక్కలు చెబుతున్నారు. ఈ సందర్భంలోనే తన పాలన గురించి కూడా చెబుతున్నారు.
ప్రస్తుతం ఏపీలో ప్రారంభమైన నూతన మద్యం పాలసీ గురించి తాజాగా మాట్లాడిన జగన్.. సాయంత్రం అయ్యేసరికి.. మద్యం కలెక్షన్.. తమ్ముళ్ల జేబుల్లోకి వెళ్తోందని అన్నారు.
ప్రైవేటుకు అప్పగించి తప్పు చేశారని.. దీనివల్ల సర్కారుకు ఆదాయం రాదని.. తమ్ముళ్లకే ఆదాయం వస్తుందని చెప్పుకొచ్చారు. అదే తమ హయాంలో అయితే.. సాయంత్రం అయ్యే సరికి నేరుగా ప్రభుత్వ ఖాతాలోకి మద్యం సొమ్ము జమ అయ్యేదని తెలిపారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా చేశామన్నారు.
ఇదే నిజమని భావిస్తే.. అప్పట్లో ఎందుకు మౌనంగా ఉన్నారన్నది ప్రశ్న. పైగా ఎక్కడా డిజిటల్ పేమెంట్ ను అనుమతించలేదు. హైకోర్టు చెప్పాక కూడా.. నగదు రూపంలో బాటిళ్లను విక్రయించారు.
ఇదే సమయంలో వైసీపీ నేతల సరుకే విక్రయిస్తున్నారని కూటమి పార్టీలు ప్రచారం చేసినప్పుడు కూడా జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారన్నది ప్రశ్న. ఇక, ఇసుక విధానంపైనా ఇదే సూక్తులు చెప్పారు. గతంలో తమ హయాంలో నేరుగా ఇసుకపై నెలకు 7500 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు.
ఇప్పుడు ఉచితం పేరుతో.. తమ్ముళ్లు దోచుకుంటున్నారని సూత్రీకరించారు. అయితే.. అప్పట్లో ఎందుకు మౌనంగా ఉన్నారన్నది ప్రశ్న. ఇసుకలో మస్కా లేకపోతే.. వైసీపీ హయాంలో ఎందుకు మౌనంగా ఉన్నట్టు? అనేది కీలక ప్రశ్న. కానీ, అప్పుడు మౌనంగా ఉన్న జగన్ ఇప్పుడు మాత్రం.. అధికారం పోయాక. అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఇదే.. రాజకీయాల్లో చిత్రం అంటే!!
This post was last modified on October 19, 2024 10:36 am
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…
ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…