వంద రోజుల ‘ప్రోగ్రెస్‌’: చంద్ర‌బాబు వేసుకున్న మార్కులు ఇవీ!

ఏపీలో కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డి.. 125 రోజులు అయింది. జూన్ 12న ముఖ్యమంత్రిగా చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారంతో కొలువుదీరిన కూట‌మి ప్ర‌భుత్వం.. 125 రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్ర‌మంలో ఆదిలోనే తాను చెప్పుకొన్న‌ట్టు స‌ర్కారుకు మార్కులు వేసుకున్నారు చంద్ర‌బాబు. వంద రోజుల ప్రోగ్రెస్‌ను ఆయ‌న తాజాగా చ‌దివి వినిపించారు. పార్టీ నాయ‌కుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో చంద్ర‌బాబు స‌ర్కారుకు మంచి మార్కులే వేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

ఇదీ ప్ర‌గ‌తి..

సీఎం చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు 100 రోజుల్లో సాధించిన ప్ర‌గ‌తిని ఆయ‌న స‌వివ‌రంగా త‌మ్ముళ్ల‌కు వివ‌రించారు. ప్ర‌గ‌తి దారుల్లో సాగిన న‌డ‌క తీరిది.

  • ప్ర‌ధానంగా.. పింఛ‌న్ల‌ను పెంచ‌డం, నెల‌నెలా వ‌లంటీర్ల సాయం లేక‌పోయినా.. 1వ తేదీనే అందించ‌డం.
  • వైసీపీ తెచ్చిన‌ చెత్త పన్ను రద్దు చేశాం.
  • మత్స్యకారులకు వెసులుబాటు క‌ల్పించేలా 217 జీవో రద్దు చేశాం.
  • కొత్త‌గా స్వర్ణకారులు కార్పొరేషన్ ఏర్పాటు
  • గౌడలకు మద్యం షాపుల్లో రిజర్వేషన్ల క‌ల్ప‌న‌.
  • అర్చకుల జీతాలు 6 నుంచి రూ.10 వేలకు పెంపు
  • నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేల వ‌ర‌కు వేతనం.
  • ధూపదీప నైవేద్యాలకు రూ.5 వేల నుండి 10 వేలకు పెంపు.
  • పారదర్శక పాలనలో భాగంగా జీవోలు ఆన్ లైన్ లో పెట్ట‌డం.
  • పోల‌వ‌రం ప‌రుగులు.. ఫేజ్-1ను రెండేళ్లలో పూర్తి.
  • నదుల అనుసంధానం మళ్లీ ప్రారంభం. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం త్వ‌ర‌లోనే.
  • రాజధాని రైతులకు రూ.400 కోట్లు బకాయిలు చెల్లింపు.
  • జాబ్ ఫస్ట్ విధానంతో దేశంలోనే మొదటిసారిగా ఎక్కువ ఉద్యోగాలు
  • సూపర్ 6 హామీల మాదిరిగా సూపర్ 6 పాలసీలు.
  • రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్

చంద్ర‌బాబు వేసుకున్న మార్కులు

  • మెరుగైన పాల‌న‌కు 89.9/100