ఔను! ఇది ముమ్మాటికీ నిజం. గత 2014-19 మధ్య చంద్రబాబు పాలన ప్రారంభించిన తర్వాత.. ఎలాంటి వార్తలు వచ్చాయో..ఇప్పుడు కూడా అలాంటివే వస్తున్నాయి. ఇక్కడేమీ కల్పిత వార్తలు వచ్చాయని చెప్ప డం లేదు. ఓపిక ఉంటే.. ఒక్కసారి వెనక్కి వెళ్లి చూసుకుంటే.. అప్పటి వర్తాలకు.. ఇప్పుడు గత నాలుగు రోజులుగా వస్తున్నవార్తలకు మధ్య చాలా సారూప్యత ఉంది. ఏమాత్రం పెద్దగా తేడా లేదు. అప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడూ అలానే ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
- బాబు సీరియస్.. తమ్ముళ్లకు వార్నింగ్
- బాబు హెచ్చరికలతో.. దిగివచ్చిన తమ్ముళ్లు
- మద్యం మాఫియాలో అధికార పార్టీ నేతలు
- ఎంత చెప్పినా వినరే
- బాబూ.. ఇక, వేచి చూడొద్దు!
- ఉచిత ఇసుక.. నేతలు మస్కా!
- బాబు మంచిని అర్ధం చేసుకోలేకపోతున్నారే!
- తాడిపత్రిలో తన్నులాట.. రెచ్చిపోయిన ప్రధాన తమ్ముడు
- పశ్చిమలో రచ్చరచ్చ.. బాబు పరువు తీస్తున్నారే
- తమ్ముళ్లు
అతి
చేస్తున్నారు! - బాబు కష్టం.. దోచేస్తున్నారు
…. ఇవి మచ్చుకు కొన్ని హెడ్డింగులు మాత్రమే. అవి కూడా రెండు ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షికల కింద పెట్టుకున్న హెడ్డింగులే. ఇవన్నీ.. 2014-18 మధ్య వచ్చిన ప్రధాన వార్తలు. కట్ చేస్తే.. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి నాలుగు మాసాలు కూడా పూర్తి కాకముందే.. దాదాపు కాపీ పేస్ట్
అన్నట్టుగా ప్రధాన పత్రికలు ఇవే హెడ్డింగులతో వార్తలు రాస్తున్నాయి. అయితే.. ఆయా పత్రికలకు సర్కారుపై కక్షేమీ లేదు. కానీ, జరుగుతున్నది వాస్తవం కాబట్టి!!
అయితే.. అప్పటికి ఇప్పటికీ.. తేడా ఒక్కటే.. నాడు కనీసం ఏడాదిపాటైనా తమ్ముళ్లు వేచి చూశారు. కానీ, ఇప్పుడు మాత్రం వచ్చీ రావడంతోనే రెచ్చిపోతున్నారు. చెలరేగిపోతున్నారు. మరి ఈ పరిణామాలను చంద్రబాబు అడ్డుకుంటారా? లేక.. తమ్ముళ్లకు నొప్పితెలియని విధంగా గిచ్చి వదిలేస్తారా? అనేది చూడాలి. ఇంతకీ కీలక పాయింట్ ఏంటంటే.. కొన్ని కొన్ని తప్పులు ఎంత అనుకూల మీడియా సర్దుబాటు చేయాలన్నా.. చివరి నిముషంలో చేతులు ఎత్తేయకతప్పదు! కాబట్టి ముందే జాగ్రత్త పడితే బెటర్!!