అధికారంలో ఉన్న వేళలో బోలెడన్ని విమర్శలతో.. ఆరోపణలతో తరచూ వార్తల్లో ఉండే వైసీపీ నేతలు.. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా కొందరి తీరులో ఇంకా మార్పు రాలేదు. తాజాగా అలాంటి షాకింగ్ ఉదంతం రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది.
ఒక యాంకర్ మీదా.. ఆమె తండ్రి మీదా వైసీపీ నేత ఒకరు దాడి చేసి గాయపర్చిన ఉదంతం చోటు చేసుకుంది. స్థానికంగా హాట్ టాపిక్ గా మారిన ఈ ఉదంతం వివరాల్లోకి వెళితే.. ఆశ్చర్యకర అంశాలు వెలుగు చూస్తాయి. అప్పు ఇవ్వటమే తప్పుగా ఈ ఉదంతంలో కనిపిస్తుంది.
వైసీపీ నేత కొడుక్కి అప్పుగా ఇచ్చిన ఒక యాంకర్.. ఆ తర్వాత ఆ డబ్బు ఊసు గురించి మాట్లాడకపోవటంతో.. దాని గురించి అడిగేందుకు వెళ్లిన వేళ.. వైసీపీ నేత వారిద్దరిపై దాడి చేసి గాయపర్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దాడికి తెగబడిన వైసీపీ నేత వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన కాజా కావ్యశ్రీ యాంకరింగ్ చేస్తుంటారు. ఆమె హైదరాబాద్ లో ఉంటారు.
ఆమెకు రాజమహేంద్రవరానికి చెందిన వైసీపీ నేత.. మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ముఖ్య అనుచరుడైన వెంకట శ్రీనివాస్ కుమారుడు అభిలాష్ తో స్నేహం ఉంది. ఈ క్రమంలో తాను చేసే బిజినెస్ కోసం కావ్యశ్రీ వద్ద రూ.3 లక్ష్లు అప్పుగా తీసుకున్నాడు. 2021లో అతడికి ఆమె క్యాష్ రూంలో ఆ మొత్తాన్ని ఇచ్చారు.
అప్పటి నుంచి అసలు మాత్రమే కాదు వడ్డీ ఊసే లేదు. ఈ క్రమంలో అతడి తండ్రి శ్రీనివాస్ వద్దకు వచ్చిన ఆ యువతి పలుమార్లు చెప్పటం.. ఏళ్లు గడుస్తున్నా అప్పు తీర్చటం లేదు. ఫోన్ చేస్తే కాల్ లిఫ్టు చేయని పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఆదివారం కోనసీమ జిల్లాలోని ఒక ఈవెంట్ కు వచ్చిన ఆమె.. తన తండ్రి నాగరాజుతో కలిసి శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు. తన దగ్గర అప్పు తీసుకున్న అభిలాష్ లేకపోవటంతో తన వద్ద తీసుకున్న డబ్బుల్ని ఇవ్వాలని అభిలాష్ తండ్రి శ్రీనివాస్ ను ప్రశ్నించారు.
ఈ క్రమంలో ఆవేశంతో ఊగిపోయిన శ్రీనివాస్.. డబ్బులు అడిగేందుకు నా ఇంటికే వస్తారా? అంటూ తండ్రీ కుమార్తెల మీద దాడికి పాల్పడ్డారు. దీంతో తమపై జరిగిన దాడిపై పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఇక.. దాడికి పాల్పడిన శ్రీనివాస్ విషయానికి వస్తే వైసీపీ ప్రభుత్వంలో అనేక సెటిల్ మెంట్లు చేసి.. మాజీఎంపీకి సన్నిహితంగా ఉండేవారని.. ఆయన తీరుపై బోలెడన్ని ఆరోపణలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.
This post was last modified on October 16, 2024 4:06 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…