బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ కేసు ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీకి చెందిన కొందరు నేతలు పోలీసుల సహకారంతో ఆమెపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ నేత కుక్కల విద్యా సాగర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో మరికొందరు వైసీపీ కీలక నేతల హస్తముందని, సీనియర్ పోలీసు అధికారుల పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ కేసు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీఐడీకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటిదాకా ఈ కేసును విజయవాడ పోలీసులు దర్యాప్తు చేశారని, ఇకపై సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తారని డిజిపి ద్వారకా తిరుమలరావు ఆదేశించారు.
గత ప్రభుత్వంలో పనిచేసిన పలువురు సీనియర్ పోలీసు అధికారులపై కూడా ఆరోపణలు రావడంతో వారిని సస్పెండ్ కూడా చేశారు. ఈ కేసులో సజ్జల పేరు కూడా వినిపించింది. దీంతో, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు తీసేందుకు లోతైన దర్యాప్తు అవసరమని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం భావించింది.
ఈ కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను, వివరాలను సిఐడికి అప్పగించాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్ని, ఏసిపి హనుమంతరావు, సత్యనారాయణ తదితరులను ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on October 16, 2024 4:08 pm
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…
ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…