చాన్సు దొరికితే చాలు చటుక్కున దూరిపోయి చైనా మరోసారి తన వంకర బుద్దిని చుపోస్తోంది. హిందూ మహాసముద్రంపై చైనా క్రమంగా తన ప్రాబల్యాన్ని పెంచుతుండడంతో, భారత్ ఇప్పుడు తమ నిఘా వ్యవస్థను బలపర్చడానికి చర్యలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో, అమెరికాతో తాజాగా ప్రిడేటర్ ఎంక్యూ 9బీ డ్రోన్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం ప్రధానంగా చర్చనీయాంశమైంది.
భారత ప్రభుత్వ నిర్ణయం మేరకు సుమారు రూ.32 వేల కోట్ల వ్యయంతో 31 ప్రిడేటర్ డ్రోన్లను సేకరించనున్నారు. ఈ డ్రోన్లు అత్యాధునిక నిఘా వ్యవస్థలు కలిగి ఉండి, నీటి మరియు భూ ప్రాంతాల్లో సమర్థవంతమైన నిఘా నిర్వహించగలవు. కుదిరిన ఒప్పందం ప్రకారం, 15 డ్రోన్లు నేవీకి, 8 ఆర్మీకి, మిగతా 8 డ్రోన్లు వాయుసేనకు అప్పగించనున్నారు.
ప్రిడేటర్ డ్రోన్లు ప్రపంచవ్యాప్తంగా అనేక సైనిక పరిణామాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిని తయారుచేసిన జనరల్ అటామిక్స్ కంపెనీ, మానవ రహిత నిఘా విమానాల తయారీలో మార్గదర్శక సంస్థగా పేరు పొందింది. భారత్‌కు ఈ డ్రోన్లు అందుబాటులోకి రాకముందే వాటిపై సైనిక, వ్యూహాత్మక వర్గాలు ఉత్సాహం చూపిస్తున్నాయి.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఈ ఒప్పందం పూర్తి కాగా, వీటి సాయంతో హిందూ మహాసముద్రంలో భారత నిఘా శక్తి మరింత పెరగనుంది. చైనా యుద్ధ నౌకలు తరచూ ప్రవేశిస్తున్న నేపథ్యంలో, ఈ డ్రోన్లు సరిహద్దులను పటిష్ఠంగా కాపాడేందుకు మార్గదర్శకంగా నిలుస్తాయని భావిస్తున్నారు. భవిష్యత్‌లో భారత్ ప్రిడేటర్ డ్రోన్లను స్మార్ట్ టెక్నాలజీతో కలిపి మరింత పురోగతిని సాధిస్తుందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on October 16, 2024 2:02 pm
జనవరి 10 విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్లలో కీలకమైనది ప్రీ రిలీజ్ ఈవెంట్. దానికి సంబంధించి నిర్మాత దిల్…
టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ సిద్ధార్థ్, అదితి రావు హైదరీ కొన్నాళ్లు ప్రేమించుకున్న తర్వాత పెద్దల ఆశీర్వాదంతో ఈ ఏడాది సెప్టెంబర్…
"వాళ్లంతా జైలుకు వెళ్లాల్సిందే.. ఇది నా పంతం" అని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఫైర్బ్రాండ్ రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు కేంద్ర మంత్రులతో పవన్…
రాష్ట్రంలో కాంగ్రెస్ భవితవ్యం ఏంటి? మున్ముందు పార్టీ పుంజుకునే పరిస్థితి ఉంటుందా? ఇదీ.. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చర్చిస్తున్న…
ఇటీవలే చెన్నైలో జరిగిన పుష్ప 2 ది రూల్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో దేవిశ్రీ ప్రసాద్ ప్రసంగం ఎంత దుమారం…