ఏపీలో నూతన మద్యం పాలసీ అక్టోబర్ 16 నుంచి అమల్లోకి రాబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 14 వ తారీకున కొత్త వైన్ షాపులకు లాటరీ ప్రక్రియ ముగియడంతో రేపటి నుంచి ఏపీలో ప్రైవేట్ రిటైల్ వైన్ షాపులు తెరుచుకోనున్నాయి.
ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉండబోతున్నాయి. ఈ రోజు ప్రభుత్వం మద్యం షాపులకు చివరి రోజు కానుంది. ఈ నేపథ్యంలోనే మద్యం షాపుల టెండర్ల ద్వారా దాదాపు 1800 కోట్ల ఆదాయాన్ని అర్జించిన ప్రభుత్వం మరో 100 కోట్ల ఆదాయం సమకూర్చుకునే ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలోనే మందుబాబులకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది.
మద్యంపై 2 శాతం సెస్ విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే అమల్లోకి వచ్చేలాగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. మద్యం అమ్మకాలపై విధించే పన్నులు కాకుండా అదనంగా ఈ రెండు శాతం సెస్ విధిస్తూ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
ఆల్రెడీ రౌండ్ ఆఫ్ చార్జీలు విధించడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఉదాహరణకు ఒక మద్యం బాటిల్ ధర 166 రూపాయలు ఉంటే రౌండాఫ్ ఛార్జీల కింద 170 రూపాయలు తీసుకోనున్నారు. దీనికి తోడు అదనంగా ఇప్పుడు 2 శాతం విధించడంతో ఈ భారం అంతా మద్యం ప్రియులపై పడనుందని విమర్శలు వస్తున్నాయి.
అయితే, అలా సెస్ విధించడం ద్వారా ఆబ్కారీ శాఖకు రూ.100 కోట్ల ఆదాయం సమకూరనుందని, ఆ డబ్బును డ్రగ్ రీహ్యాబిలిటేషన్ సెస్ కింద ప్రభుత్వం వసూలు చేయనుంది.
మరోవైపు, మద్యం సిండికేట్లు ఏర్పడతాయని, ఆ తర్వాత ప్రైవేటు రిటైలర్లు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుకుంటారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. వాటికి సెస్, రౌండ్ ఆఫ్ చార్జీలు అదనంగా ఉంటే మందుబాబుల జేబుకు చిల్లు పడటం ఖాయమని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
This post was last modified on October 16, 2024 1:59 pm
వంశీ పైడిపల్లికి యావరేజ్ డైరెక్టర్ అని పేరుంది. అతను గొప్ప సినిమాలేమీ తీయలేదు. కానీ.. అతను కెరీర్లో ఇప్పటిదాకా పెద్ద…
ఇంకో ఇరవై రోజుల్లో విడుదల కాబోతున్న పుష్ప 2 ది రూల్ మీద అంచనాలు కొలవాలంటే తలలు పండిన ట్రేడ్…
జనం డబ్బుతో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్, షర్మిల, విజయమ్మ, సునీతలను జగన్ బూతులు తిట్టించారా? అంటే అవును అని…
అగ్ర రచయిత పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తుతం సినిమాలకు రచన చేయకపోయినా కొత్త రిలీజులు చూస్తూ వాటి తాలూకు లోటుపాట్లు, ప్లస్…
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున 11 మంది ఎమ్మెల్యేలు విజయం దక్కించుకున్నారు. వీరిలో జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…
అసెంబ్లీకి వెళ్లకుండా జగన్ కుంటి సాకులు చెబుతున్నారని, సభ అంటే గౌరవం లేని జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని…