Political News

స‌జ్జ‌ల విష‌యాన్ని బాబు సీరియ‌స్‌గా తీసుకోలేదా?

వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ మాజీ సల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అడ్డంగా బుక్క‌య్యారు. ఏపీ ప్ర‌భుత్వం స‌జ్జ‌ల‌పై కేసు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. దీనిపై ఇంకా ఎఫ్ఐఆర్ న‌మోదు కావాల్సి ఉంది. ప్ర‌స్తుతం కేసు పూర్వాప‌రాల‌ను మాత్ర‌మే పోలీసులు ప‌రిశీలిస్తున్నారు. ఈ నేప‌థ్యం లో తాజాగా స‌జ్జ‌ల విదేశాల నుంచి స్వ‌దేశానికి వ‌చ్చారు. అయితే.. ఆయ‌న విదేశాల‌కు పారిపోతున్నార‌ని భావించిన ఇమ్మిగ్రేష‌న్ వ‌ర్గాలు ఢిల్లీలో ఆయ‌న‌ను అడ్డుకున్నాయి. దీనికికార‌ణం.. స‌జ్జ‌ల‌పై లుక్ అవుట్ నోటీసులు ఉండ‌డ‌మే.

ఏంటీ కేసు..

మ‌హారాష్ట్ర‌లోని ముంబైకి చెందిన న‌టి.. కాదంబ‌రి జెత్వానీని అక్ర‌మ కేసులో ఇరికించార‌న్న అభియోగం. వైసీపీకి చెందిన కుక్క‌ల విద్యాసాగ‌ర్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు.. అప్ప‌టి ఐపీఎస్‌లు, విశాల్ గున్నీ, కాంతి రాణా టాటాలు.. ప్ర‌త్యేకంగా ముంబై వెళ్లి ఆమెతోపాటు ఆమె కుంటుంబాన్ని కూడా అక్ర‌మంగా అరెస్టు చేసి విజ‌య‌వాడ స‌మీపంలోని ఇబ్ర‌హీంప‌ట్నానికితీసుకువ‌చ్చి.. నిర్బంధించార‌ని జ‌త్వానీ ఇటీవ‌ల ఫిర్యాదు చేశారు. ఈ క్ర‌మంలో త‌నను మాన‌సికంగా.. శారీర‌కంగా కూడా ఇబ్బంది పెట్టార‌ని ఆమె పేర్కొన్నారు.

దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆదేశించిన రాష్ట్ర ప్ర‌భుత్వం సీఐడీ ద్వారా కూపీ లాగింది. జెత్వానీ వేధింపులు.. ఆమెపై కేసు వంటివి అన్నీ కూడా.. నాటి స‌ర్కారు స‌ల‌హాదారు స‌జ్జ‌ల క‌నుస‌న్నల్లోనే జ‌రిగిన‌ట్టు అధికారులు గుర్తించారు. అయితే.. ఆయ‌న అరెస్టు విషయంపై ఇంకా ఎలాంటి నిర్న‌యం తీసుకోలేదు. కానీ, ఇంత‌లోనే స‌జ్జ‌ల హైకోర్టును ఆశ్ర‌యించి ర‌క్ష‌ణ పొందే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. కానీ, విచార‌ణ వాయిదా ప‌డింది.

అయితే.. ఏక్ష‌ణ‌మైనా స‌జ్జ‌ల‌ను అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న స‌మ‌యంలో ఆయ‌న ఢిల్లీ ఎయిర్ పోర్టులో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. కానీ, ఆయ‌న విదేశాల‌కు వెళ్లిపోవ‌డం లేదు. విదేశాల నుంచి వ‌స్తున్నారు. ఈ విష‌యం తెలియ‌ని ఇమ్మిగ్రేష‌న్ అధికారులు కొద్దిసేపు హ‌డావుడి చేశారు. అనంత‌రం.. ఏపీకి వెళ్తున్నాన‌ని చెప్ప‌డంతో వ‌దిలేశారు.

డౌట్ ఏంటంటే..

స‌జ్జ‌ల‌పై లుక్ అవుట్ నోటీసులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. కానీ, ఈ నోటీసులు ఎప్పుడు ఇచ్చారు? ఎవ‌రు ఇచ్చారు? ఇస్తే.. ఆయ‌న విదేశాల‌కు ఎందుకు వెళ్లిన‌ట్టు? ఒక వేళ లుక్ అవుట్ నోటీసులు ఇచ్చాక వెళ్లారా? లేక వెళ్లిన త‌ర్వాత‌.. ఇచ్చారా? ఇదే జ‌రిగితే.. స‌జ్జ‌ల అంత ధైర్యంగా ఎలా వ‌చ్చారు? దీని వెనుక ఏంజ‌రుగుతోంది? సీఎం చంద్ర‌బాబు స‌జ్జ‌ల విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేదా? అనేది అనేక సందేహాల‌కు దారితీస్తోంది.

This post was last modified on October 16, 2024 1:58 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

5 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

5 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

6 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

6 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

7 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

7 hours ago