జమ్ముకశ్మీర్ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాలకు గాను నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్.సీ) పార్టీ నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి మెజారి టీ స్థానాలు దక్కించుకున్న విషయం తెలిసిందే.
90 అసెంబ్లీ స్థానాలకు గాను(మరో 5 నామినేటెడ్ స్థానా లు ఉన్నాయి) ఎన్.సీ 42 స్థానాల్లో విజయం దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ 6 స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కింది. ఈ రెండు కలిసి.. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది.
అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కూటమి నుంచి తాము తప్పుకొంటున్నట్టు ప్రకటించింది. అంటే.. ఎన్.సీ కి కాంగ్రెస్ పార్టీ దూరమైంది. దీంతో ఎన్‌సీ మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. దీంతో ఒక్కసారిగా జమ్ము, కశ్మీర్ రాజకీయాలు సంచలనంగా మారాయి.
అయితే.. కాంగ్రెస్ పార్టీ కూటమి నుంచి తప్పుకొని.. బయట నుంచి మద్దతు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అంటే.. ఒకరకంగా ఎన్‌సీని ఇరకాటంలో పడేసినట్టు అయింది.
బయట నుంచి మద్దతు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌సీ అధినేత .. ఒమర్ అబ్దుల్లాకు ఇబ్బంది లేకపోయినా.. భవిష్యత్తుల్లో మాత్రం ప్రభుత్వం సంకటపరిస్థితిని ఎదుర్కొనే అవకాశం కనిపి స్తోంది. అయితే.. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై అనేక విశ్లేషణలు వస్తున్నాయి.
ప్రధానంగా తాము కొలువు దీరగానే.. జమ్ము కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్‌ను పునరుద్ధరించే అంశంపై తీర్మానం చేస్తామని ఒమర్ అబ్దుల్లా ఎన్నికల సమయంలో ప్రకటించారు.
ఇప్పుడు దానిని చేసి తీరుతానని కూడా ఆయన చెబుతున్నారు. దీంతో ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ విభేదిస్తోంది. ఇక, ఒమర్ తన మంత్రి వర్గంలో కాంగ్రెస్‌కు చోటు ఇచ్చే విషయంలో పునరాలోచనలో పడినట్టు గత రెండు రోజులుగా వార్తలు వచ్చాయి.
ఎందుకంటే..కాంగ్రెస్ మిత్రపక్షమైనప్పటికీ.. కేవలం 6 స్థానాల్లోనే విజయం దక్కించుకోవడంతో మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం కనిపించడంలేదు. ప్రధానంగా ఈ రెండు కారణాలతోనే కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.
This post was last modified on October 16, 2024 11:45 am
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…
ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…