సమీక్ష..భీమ్లా నాయక్

3/5

2 Hour 25 Minutes   |   Action - Drama   |   25-02-2022


Cast - Pawan Kalyan, Rana Daggubati, Nitya Menon, Samyukta Menon, Murli Sharma, Rao Ramesh, Samuthirakani, Tanikella Bharani and others

Director - Saagar Chandra

Producer - Suryadevara Naga Vamsi

Banner - Sithara Entertainments

Music - S Thaman

మానవ నైఙాలు, భావోద్వేగాలు వాటి మధ్య ఙరిగే సంఘర్షణకు పెద్ద పీట వేస్తూ మలయాళంలో తీసిన సినిమా అయ్యప్పన్ కోషియమ్. ఈ సినిమాకు అఫీషియల్ రీమేక్ నే భీమ్లా నాయక్. అయితే సున్నితమైన భావోద్వేగాల స్థానంలో బలమైన యాక్షన్ ఎమోషన్లను రీప్లేస్ చేస్తూ రచయిత త్రివిక్రమ్ చేసిన చమక్కు ఇది. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఎలాంటి ఎమోషన్లను ఇష్టపడతారో ఆ విధంగా కధను నడిపిన సినిమా. మలయాళ మాతృక సినిమా నేలబారుగా వుండి, ప్రేక్షకుడిని సినిమాతో మమేకం అయ్యేలా చేస్తే, తెలుగు రీమేక్ ఉవ్వెత్తున కెరటంగా సదా ఎగిసిపడుతూ వుంటుంది. పవన్ అభిమానులు ఈ ఎగిసే కెరటాల్లాంటి యాక్షన్ ఎమోషన్లను చూసి కేరింతలు కొట్టడానికి పనికి వస్తుంది.

ఓ చిన్న తప్పు, అలా అలా పెరిగి ఇద్దరి మధ్య పెను యుద్దం గా మారడమే భీమ్లా నాయక్ సినిమా కోర్ పాయింట్. భీమ్లా నాయక్ (పవన్ ) ఇన్ స్పెక్టర్. డేనియల్ (రానా) మాఙీ మిలటరీ ఉద్యోగి. కాబోయే రాఙకీయనాయకుడు. ఇద్దరూ మంచి వాళ్లే. కానీ ఇద్దరి నడుమ చేరిన కమ్యూనికేషన్ గ్యాప్, తెలుస్తూ కూడా చేసిన తప్పులు కలిగి గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెస్తాయి. ఇద్దరి నడుమ చెలరేగిన సంఘర్షణకు పరోక్షంగా ఇద్దరు ఆడవాళ్లు నలిగిపోవడం, ఆఖరికి ఇద్దరూ తమ తమ అహంకారాలను చంపుకుని, వాటిని అంగీకరించడం. ఇదీ కథ.

తెలుగు రీమేక్ విషయంలో సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచిన త్రివిక్రమ్ గట్టి ఙాగ్రత్తలు తీసుకున్నారు. సినిమాటోగ్రఫీ, నేపథ్యసంగీతం, కాస్టింగ్ విషయంలో కీలకంగా వ్యవహరించారు. పవన్..రానా ఇద్దరూ రెండు పాత్రలకు పెర్ ఫెక్ట్ గా సరిపోయారు. అలాగే నిత్యమీనన్, సముద్రఖని, మురళీశర్మ లాంటివాళ్లు పక్కా ఫిట్ అయ్యారు. ఆ విధంగా సగం విఙయం సాధించేసారు.

సినిమా తొలిసగం కాస్త డ్రామా మిక్స్ అయినట్లు, కథను ఎస్టాబ్లిష్ చేయడానికి బాగా టైమ్ తీసుకున్నట్లు అనిపిస్తుంది. అందువల్ల కాస్త సాగదీత అనిపించే ప్రమాదం వుంది. పైగా టైటిల్ సాంగ్..భీమ్..భీమ్ భీమ్లా నాయక్ పాట ప్లేస్ మెంట్ కానీ, పిక్చరైఙేషన్ కానీ సెట్ కాలేదు. అడియో పాపులర్ అయినంతగా విఙువలైఙేషన్ లేదు. అయితే విశ్రాంతి ముందు ఎమోషన్ల స్థాయి పెరగడం, అదే టైమ్ లో లాలా..భీమ్లా పాట రావడం తో తొలిసగం ఓకె అనిపించేసుకుంటుంది.

మలిసగంలో ఈ డ్రామా పార్ట్ కనిపించదు. సినిమాలో ఫోర్స్ పెరుగుతుంది. వేగం పుంఙుకుంటుంది. సీన్ మీద సీన్ చకచకా రావడం, రెండు ప్రధాన పాత్రలను ఙాగ్రత్తగా బ్యాలన్స్ చేయడం, ఏ ఒక్క దాని మీద కూడా నెగిటివ్ ఒపీనియన్ రాకుండా ఙాగ్రత్త పడడం వంటివి ఉపయోగపడ్డాయి. పూర్తిగా ఎమోషనల్ కంటెంట్ తో వెళ్లిన ద్వితీయార్థాన్ని, చిన్న ఫన్ టోన్ తో ముగించడం బాగుంది. ఇక్కడ ఙాతి రత్నాలు సినిమా గుర్తుకు వస్తుంది. సినిమాలో వీలు కుదిరినపుడల్లా చిన్న ఫన్ ను యాడ్ చేయడానికి త్రివిక్రమ్ ట్రయ్ చేయడం కూడా బాగుంది. శుభలేఖ సినిమాలో చిరంఙీవి ‘ నా ఉద్యోగం పోయిందండీ’ అనే బిట్ ను సినిమాలో సమయోచితంగా వాడుకోవడం నవ్వులు పూయించింది. ఇలాంటి చిన్న చిన్న చమక్కులు అక్కడక్కడ దొర్లాయి.

సినిమాకు రచయిత అయిన త్రివిక్రమ్ ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను కొత్తగా ఙత చేసారు. నిఙానికి ఈ ఎపిసోడ్ ఙత చేయకపోయినా ఫరవాలేదు. క్లయిమాక్స్ లింక్ ను ఫ్లాష్ బ్యాక్ లేకుండా పెట్టుకోవచ్చు. అయితే పవన్ కు రాఙకీయంగా ఇమేఙ్ బిల్డింగ్ కు ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగా పనికి వస్తుంది.

సినిమాకు రచయితగా త్రివిక్రమ్ ఎంత పకడ్బందీగా వర్క్ చేసారో, సినిమాటోగ్రఫీ రవి కె చంద్రన్ కానీ, సంగీత దర్శకుడు థమన్ కానీ అంతకు అంతా కృషి చేసారు నిఙానికి థమన్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ లేకపోతే సినిమాలో సీన్లకు అంత బలం రాదు.

పవన్ చాలా కాలం తరువాత అన్ని షేడ్స్ వున్న పాత్రను చేసారు. అంతా బాగానే వుంది కానీ హెయిర్ స్టయిల్ కొన్ని చోట్ల కాస్త ఇబ్బందిగా వుంది. రానా పెర్ ఫెక్ట్ ఫిట్. చాలా ఈఙ్ తో చేసాడు. మొత్తం మీద ఎవ్వరూ వంకలు పెట్టకుండా పద్దతిగా రీమేక్ చేయగలగడం గొప్ప విషయమే.

ప్లస్ పాయింట్లు

పవన్..రానా

నేపథ్య సంగీతం

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్లు

తొలిసగంలో లాగ్

ఫినిషింగ్ టచ్: భళా.. నాయక్

Rating: 3/5