పాన్ ఇండియా నెంబర్ వన్ స్టార్ ప్రభాస్ ఎన్ని సినిమాలు లైన్ లో పెట్టినా కూడా అందరి ఫోకస్ ఎక్కువగా సందీప్ రెడ్డి స్పిరిట్ పైనే ఉంది. అసలే యానిమల్ తో ఊచకోతకు అర్థం చూపిన వంగా ఈసారి అంతకుమించి అనేలా డార్లింగ్ ను హైలెట్ చేస్తాడనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది. సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న ఈ దర్శకుడు పనిలో పనిగా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కోసం కొంతమంది స్టార్ నటీనటులను కూడా సంప్రదిస్తున్నట్లు టాక్ అయితే వస్తోంది.
కథకు సంబంధించిన ఫుల్ స్క్రిప్ట్ అయితే సిద్ధమైంది. ఇక డైలాగ్ పోర్షన్ కోసమే సందీప్ కాస్త ఎక్కువ టైమ్ తీసుకుంటున్నాడు. అది కాస్త ఈ ఏడాది చివరిలోపు ఫినిష్ కావచ్చు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే సందీప్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి పై ఫోకస్ పెంచినట్లు ఒక టాక్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
ఆయనది ఒక్క ఉన్నత పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అని, కాదు హీరోకు తండ్రిగా కనిపించనున్నారని.. ఇలా రకరకాల గాసిప్స్ పుట్టుకొచ్చాయి. నిజానికి సందీప్ వంగా అలాంటి పెద్ద నటులను ఎవరిని ఫైనల్ చేయలేదట. ఇప్పటివరకు డైరెక్ట్ గా కూడా ఏ యాక్టర్ ని కలవలేదని తెలుస్తోంది. కేవలం చర్చల దశలోనే కొంతమంది నటులను అనుకోగా అందులో మమ్ముట్టి పేరు కూడా ఉన్నట్లు సమాచారం.
యాత్ర సినిమాతో తెలుగు జనాలకు బాగా దగ్గరైన మమ్ముట్టి ఆ మధ్య అఖిల్ ఏజెంట్ సినిమాలో కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించారు. కానీ ఆ సినిమా దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఆ తరువాత కూడా కొన్ని తెలుగు సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ కోసం ఆఫర్స్ వచ్చినప్పటికీ ఎందుకనో ఆయన ఒప్పుకోలేదు. ఇక స్పిరిట్ అంటే తప్పనిసరి ప్రభాస్ కోసమైనా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కాయం. మరి ఈ కాంబినేషన్ నిజంగా సెట్టవుతుందో లేదో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
This post was last modified on October 13, 2024 4:12 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…